సోనూ సూద్‌కు మరో అరుదైన గౌరవం
close

తాజా వార్తలు

Published : 18/11/2020 00:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోనూ సూద్‌కు మరో అరుదైన గౌరవం

శభాష్‌ సోనూ.. గవర్నర్‌ ప్రశంస

దిల్లీ: ప్రముఖ నటుడు సోనూసూద్‌కు మరో గౌరవం దక్కింది. ఆయనను పంజాబ్‌ రాష్ట్ర ఎన్నికల ఐకాన్‌గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ సందర్భంగా సోనూసూద్‌కు పంజాబ్‌ గవర్నర్ వీపీ సింగ్‌ బద్నోర్‌ అభినందనలు తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ కాలంలో ఆయన సేవలు ప్రశంసనీయమని ప్రశంసించారు. ఈ గౌరవాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ సోనూ కృతజ్ఞతలు తెలిపారు. పంజాబ్‌లో జన్మించిన తనకు ఈ అవకాశం వ్యక్తిగతంగా ఎంతో విలువైనదని ఆయన వివరించారు. తన రాష్ట్రానికి గర్వకారణమైనందుకు సంతోషంగా ఉందన్న సోనూ.. ఈ చర్య ద్వారా మరింత కృషి చేసేందుకు ప్రేరణ లభించిందన్నారు.

లాక్‌డౌన్‌ అనంతరం కూడా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలో సోనూ ముందున్నారు. మాస్కులు, ఆహారం తదితర అవసరాలను వారికి అందిస్తున్నారు. ఇక నిజమైన హీరోగా ప్రజల గుండెల్లో ముద్రవేసుకున్న ఆయన ప్రముఖ విలేకరి మీనా అయ్యర్‌ సహాయంతో ‘ఐ యామ్‌ నో మెస్సయ్య’ అనే పుస్తకాన్ని రచించారు. కాగా.. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ పుస్తకం ఆంగ్లం, హిందీ భాషల్లో లభిస్తుందని తెలిపారు. కాగా సోనూ సూద్‌ ప్రస్తుతం ఆక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘పృథ్వీరాజ్‌’ లో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని