close

తాజా వార్తలు

Updated : 25/11/2020 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కంటతడి పెట్టుకున్న సోనూసూద్‌

ముంబయి: కరోనా క్లిష్టకాలంలో నిస్సహాయులకు అండగా నిలిచి రియల్‌ హీరోగా మారిన సోనూసూద్‌ను కలిసేందుకు అర్మాన్‌ అనే అభిమాని సాహసం చేశాడు. సైకిల్‌పై బిహార్‌ నుంచి ముంబయికి బయలుదేరాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ భావోద్వేగానికి గురయ్యారు. అభిమాని చూపిస్తున్న ప్రేమకు కంటతడి పెట్టుకున్న ఆయన అతడికి సాయం చేయడం కోసం సన్నాహాలు చేశారు. మార్గ మధ్యంలో అతడితో సంప్రదింపులు జరిపి.. విమానంలో ముంబయికి వచ్చే ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని సోనూ స్వయంగా చెప్పారు. ‘నేను అర్మాన్‌తో మాట్లాడాను. అతడు వారణాసి చేరుకున్నాడు. సైకిల్‌పై బిహార్‌ నుంచి రావడం మంచిది కాదని చెప్పా. విమానంలో ముంబయికి వచ్చేలా ఒప్పించాను. అతడి రాకపోకలకు అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. అర్మాన్‌కు నేనంత ప్రత్యేకమైనప్పుడు.. అతడి రాకను నేను ఇంకా ప్రత్యేకం చేస్తా. సైకిల్‌ కూడా విమానంలో వస్తోంది, వెళ్లేటప్పుడు కూడా దాన్ని తిరిగి పంపిస్తా. ఓ సారి నన్ను బిహార్‌ రమ్మని అక్కడి ప్రజలు అడుగుతున్నారు. దానికి కాస్త సమయం పడుతుంది’ అని పేర్కొన్నారు.

మరోపక్క పేదలకు అండగా నిలిచి మానవతాదృక్పథం చాటుకున్న సోనూ సోషల్‌ మీడియా అనలైటికల్‌ సంస్థ అక్టోబర్‌కు సంబంధించి ప్రకటించిన నివేదికలో.. అన్ని విభాగాల్లో కలిపి నాలుగో స్థానంలో నిలిచారు. రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు, సినిమాలు ఇలా వివిధ రంగాల్లో కలిపి టాప్‌ సెలిబ్రిటీస్‌ ఎవరని శోధించగా.. సోనూ అందులో చోటు దక్కించుకున్నారు. అగ్ర స్థానంలో మోదీ, రెండో స్థానంలో రాహుల్‌ గాంధీ, మూడో స్థానంలో విరాట్‌ కోహ్లీ ఉండగా.. 2.4 మిలియన్ల ప్రస్తావనలతో నాలుగో స్థానంలో సోనూసూద్‌ ఉన్నారు.


Tags :

సినిమా

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని