close
Array ( ) 1

తాజా వార్తలు

టీ20ల్లో అరుదైన రికార్డు సృష్టించిన తొలి క్రికెటర్‌

దిగ్గజాలను వెనక్కినెట్టిన కివీస్ కెప్టెన్‌ సోఫీ

వెల్లింగ్టన్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ మహిళా జట్టు సారథి సోఫీ డివైన్ క్రికెట్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఏ క్రికెట్‌లో అయినా వరుసగా ఐదు టీ20ల్లో 50కి పైగా పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా సోఫీ అవతరించింది. దక్షిణాఫ్రికాతో సోమవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో సోఫీ (105; 65 బంతుల్లో 12x4, 3x6) శతకంతో కదం తొక్కింది. ఈ సిరీస్‌కుముందు భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె 72 పరుగులతో అలరించింది. ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన గత మూడు టీ20ల్లో వరుసగా 54, 61, 77 పరుగులు చేసింది. 

ఈ క్రమంలో సోఫీ.. మిథాలీ రాజ్‌, బ్రెండన్‌ మెక్‌కలమ్‌, క్రిస్‌గేల్‌ లాంటి దిగ్గజాలను వెనక్కి నెట్టింది. వీళ్లంతా పొట్టి క్రికెట్‌లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే 50కి పైగా పరుగులు సాధించారు. ఇప్పుడు సోఫీ వారిని అధిగమించింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో శతకం బాదిన సోఫీ.. టీ20ల్లో కివీస్‌ తరఫున మూడంకెల స్కోర్‌ అందుకున్న రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. అంతకుముందు తన సహచర క్రికెటర్‌ సుజీ బేట్స్‌ మహిళా జట్టులో తొలి శతకం బాదింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 17 ఓవర్లలోనే 102 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్‌ 69 పరుగుల తేడాతో విజయం సాధించి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.