స్పెయిన్‌లో అంత్యక్రియలపైనా ఆంక్షలు..!
close

తాజా వార్తలు

Updated : 31/03/2020 13:21 IST

స్పెయిన్‌లో అంత్యక్రియలపైనా ఆంక్షలు..!

ఇంటర్నెట్ డెస్క్‌‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) సృష్టిస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు. ఈ దెబ్బకు ఇప్పటికే అనేక దేశాలు విధించిన ఆంక్షలు రోజురోజుకీ మరింత కఠినతరం అవుతున్నాయి. దీంతో అనేక దేశ రాజధానులు బోసిపోయి కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పడూ నిద్రపోని న్యూయార్క్‌ నగరం ఇప్పుడు గడగడలాడుతోంది. నౌకలు, రైళ్లు ఆస్పత్రులుగా మారుతున్నాయి. సాంస్కృతిక, క్రీడా ఉత్సవాలు పూర్తిగా రద్దయ్యాయి. రోజురోజుకీ కరోనా తీవ్రత ఎక్కవవుతుండడంతో ఈ ఆంక్షలు మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

* స్పెయిన్‌లో అయితే కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. అక్కడి ప్రభుత్వం ఏకంగా సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను జరపడాన్ని నిషేధించింది. ఎవరైనా చనిపోతే కుటుంబసభ్యలతో సహా ఇద్దరు లేదా ముగ్గురి కంటే ఎక్కువ హాజరుకావొద్దని ఆదేశించింది. అంత్యక్రియలకు ప్రజలు సామూహికంగా వెళ్లొద్దని స్పష్టం చేసింది. అక్కడ ఏప్రిల్‌ 11 వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

* ఇక చైనాలో సోమవారం కొత్తగా 48 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు అక్కడ 3,305 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజే 282 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఇక ఐసీయూలో ఉన్నవారి సంఖ్య సైతం 528 నుంచి 282కు పడిపోయిందని తెలిపారు.   

* ఇటలీలో విధించిన లాక్‌డౌన్‌ను కనీసం ఏప్రిల్‌ 12 వరకు పొడిగిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కఠిన నిర్ణయమే అయినప్పటికీ.. ఆంక్షలు విధించిక తప్పడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటలీలో 24 గంటల్లో 812 మంది మృతిచెందారని సోమవారం అక్కడి అధికారులు తెలిపారు. ఆ దేశంలో వైరస్‌ బాధితుల సంఖ్య లక్ష దాటింది. వీరిలో 14,650 మంది కోలుకున్నారు. మరో 11,591 మంది మృతిచెందారు.

* వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న మరో దేశం ఫ్రాన్స్‌లో సోమవారం 418 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మృతుల సంఖ్య 3024కు పెరిగింది. ఇప్పటి వరకు మొత్తం 44,550 మందిలో వైరస్‌ ఆనవాళ్లు గుర్తించగా.. వీరిలో 7,964 మంది కోలుకున్నారు. మరో 33,562 మంది ఆప్పత్రుల్లో చికిత్స పొందుతన్నారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకినవారి సంఖ్య : 7,86,228
కోలుకున్నవారి సంఖ్య : 1,66,041
మృతుల సంఖ్య : 37,820  

ఇవి చదవండి..

భారత్‌లో పెరిగిన కరోనా మరణాలు..

ఏపీలో 40కి చేరిన కరోనా కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని