
తాజా వార్తలు
ఎస్పీబీ కోసం శబరిమలలో సంగీత సమర్పణ
శబరిమల: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా నుంచి కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఉషా పూజలతో స్వామివారికి సంగీత సమర్పణ చేసినట్టు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. బాలు ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థిస్తూ ఆయన పేరుతో పూజలు చేసినట్టు తెలిపింది. నాద స్వరం, తబలా వంటి వాయిద్యాలతో స్వామివారి ముందు సంగీత సమర్పణ చేసినట్టు దేవస్థానం బోర్డు పేర్కొంది. బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ‘శంకరా.. నాద శరీరా’ పాటను దేవస్థాన వాయిద్యకారులు తమదైన రీతిలో ప్రదర్శించారు.
కరోనా బారినపడిన బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు ఆయన్ను ఐసీయూలో ఉంచి వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కన్నీటి పర్యంతమైన మోదీ
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
