close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 119015887 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1176341737440043008 [video_short_link] => 1176341737440043008 [created_by] => [created_date] => [modified_by] => 1017782 [modified_date] => 2019-09-24 14:35:57.922486 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

పాక్‌పై చారిత్రక విజయానికి పన్నెండేళ్లు

 2007 టీ20 ఫైనల్‌:

అప్పటికే వన్డే ప్రపంచకప్‌లో ఘోర వైఫల్యం చెందిన టీమిండియా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న రోజులవి. రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్‌గా తప్పుకొని ధోనీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తొలి రోజులు. అలాంటి పరిస్థితుల్లో భారత్‌ తొలి టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమైంది. ఆ సంగ్రామంలో యువరాజ్‌ బ్యాటింగ్‌, జోగిందర్‌ బౌలింగ్‌ ఎవరూ మర్చిపోలేరు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గెలవడం టీమిండియాకే కాదు యావత్‌ భారత దేశానికి పండుగ రోజు. నరాలు తెగే ఉత్కంఠ పోరులో పాకిస్థాన్‌ గెలుస్తుందేమోననే సందేహంతో సగటు భారత అభిమాని గుండె లయ తప్పిన వేళ, భారత లెజెండ్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ప్రశాంతంగా ఉంటూ తిరుగులేని వ్యూహంతో దాయాదిని బోల్తాకొట్టించాడు. టీమిండియా సగర్వంగా పొట్టి క్రికెట్‌లో ఛాంపియన్‌గా అవతరించింది. చిరకాల ప్రత్యర్థిపై ఆ అద్భుత విజయం సాధించి నేటికి పన్నెండేళ్లు పూర్తైన సందర్భంగా ఆనాటి మధురస్మృతులను ఒకసారి గుర్తు చేసుకుంటే.. 

గంభీర్‌, రోహిత్‌ చెలరేగగా:

జొహనెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన ధోనీ బ్యాటింగ్‌ ఎంచుకోగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. గౌతమ్‌ గంభీర్‌ (75; 54 బంతుల్లో 8x4, 2x6), రోహిత్‌శర్మ(30; 16 బంతుల్లో 2x4, 1x6) రాణించడంతో పోరాడే స్కోర్‌ సాధించిన భారత్‌.. లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ను 19.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌట్‌ చేసింది. కాగా పాక్‌ బ్యాట్స్‌మన్‌ మిస్బా ఉల్‌ హక్‌(43) ఆ జట్టుని గెలిపించినంత పనిచేశాడు. ఆఖరి ఓవర్‌లో జోగిందర్‌శర్మ బౌలింగ్‌ చేయగా శ్రీశాంత్‌ అనూహ్యంగా మిస్బా క్యాచ్‌ పట్టి భారత్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. ధోనీ సారథ్యంలోని టీమిండియా ఐదు పరుగుల తేడాతో పాక్‌పై గెలుపొంది తొలి టీ20 ప్రపంచకప్‌ కైవసం చేసుకుంది.

ధోనీ ధైర్యం.. జోగిందర్‌ మాయ:

లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 19 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. ఆ సమయంలో క్రికెట్‌ చూస్తున్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ. ఆ సమయంలోనూ టీమిండియా కెప్టెన్‌ కూల్‌ చాలా ప్రశంతంగా కనిపించి అందరిలో ఆశ్చర్యం కలిగించాడు. ఇదిలా ఉండగా ఆఖరి ఓవర్‌లో ఎవరికి బౌలింగ్‌ ఇస్తాడా అనే సందేహం నెలకొనడంతో యువ పేసర్‌ జోగిందర్‌శర్మకి బంతినిచ్చాడు ధోని. పాక్‌ గెలవాలంటే ఆరు బంతుల్లో 13 పరుగులు చేయాలి. అప్పటికే క్రీజులో ఉన్న మిస్బా సిక్సులతో చెలరేగుతున్నాడు. దీంతో జోగిందర్‌ అతడిని కట్టడిచేయగలడా అనే సందేహం అందరిలో నెలకొంది.

ఆఖరి ఓవర్‌ సాగిందిలా:

ధోనీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జోగిందర్‌ మిస్బాని కట్టడి చేశాడు. తొలి బంతి ఆఫ్‌స్టంప్‌ ఆవల వైడ్‌గా వెళ్లడంతో అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.  తర్వాతి బంతి గుడ్‌లెంగ్త్‌తో వేయడంతో మిస్బా బ్యాట్‌కు అందలేదు. ఇక రెండో బంతి ఫుల్‌టాస్‌ వేయడంతో బ్యాట్స్‌మన్‌ దాన్ని సిక్స్‌గా మలిచాడు. సమీకరణం నాలుగు బంతుల్లో ఆరు పరుగులుగా మారింది. ఇక టీమిండియా పనైపోయిందని అంతా భావించిన సమయంలోనూ ధోనీ ప్రశాంతంగా కనిపించాడు. సరిగ్గా అప్పుడే జోగిందర్‌ మూడో బంతి వేయగా మిస్బా షార్ట్‌ఫైన్‌ లెగ్‌ దిశగా దాన్ని గాల్లోకి లేపాడు. అంతా సిక్స్‌ అని భావించిన వేళ శ్రీశాంత్‌ అద్భుతరీతిలో క్యాచ్‌ అందుకోవడంతో ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యం. పాకిస్థాన్‌ ఓడిపోయింది. ఐదు పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందింది. పొట్టి క్రికెట్‌లో టీమిండియా తొలి ఛాంపియన్‌గా నిలిచిన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

ఈ నేపథ్యంలో మున్ముందు కూడా భారత జట్టు ఇలాగే ఆడి మరిన్ని చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకొని, అభిమానులను అలరించాలని కాంక్షిస్తూ.. ఆల్‌ ది బెస్ట్‌!!                                                  

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

 

 

 

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.