close
Array ( ) 1

తాజా వార్తలు

14 వరకు శ్రీవారి దర్శనాలు నిలిపివేత

తిరుమల: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. నివారణ చర్యల్లో భాగంగా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించ కూడదని తితిదే నిర్ణయించింది. ఏప్రిల్‌ 14 వరకు స్వామివారికి కేవలం నిత్య కైంకర్యాలను మాత్రమే నిర్వహిస్తామని, భక్తులను దర్శనానికి అనుమతించబోమని తితిదే ప్రకటించింది. మరోవైపు రెండు కనుమ రహదారులను దేవస్థానం అధికారులు మూసివేశారు. తితిదే సిబ్బంది తిరుమలలో వారం రోజుల పాటు షిఫ్ట్‌ పద్ధతిలో విధులు నిర్వహించనున్నారు. తిరుపతిలో 50 వేల మందికి దేవస్థానం తరఫున ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్‌ 2న శ్రీరామ నవమి సందర్భంగా నిర్వహించాల్సిన శ్రీవారి హనుమంత సేవను కూడా తితిదే రద్దు చేసింది. స్వామివారి వార్షిక వసంతోత్సవాలను కూడా కల్యాణ మండపంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించింది.

పేదలకు ఆహార వితరణ 
భక్తి శ్రద్ధలతో కలియుగ వైకుంఠనాథుడి దర్శనానికి వచ్చే భక్తుల ఆకలి దప్పికలు తీర్చే తితిదే.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సామాజిక సేవలో భాగమైంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేపట్టిన వేళ.. ఉపాధి కోల్పోయి తినడానికి తిండిలేక అవస్థలు పడుతున్న పేద ప్రజల ఆకలి తీర్చేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రోజుకు రెండు పూటలా వివిధ ఆహార పదార్థాలను తిరుపతి నగరంలోని కాలనీల్లో పంపిణీ చేస్తోంది. మధ్యాహ్నం 35వేలు, రాత్రి 15వేల అన్నం పొట్లాలను అందిస్తోంది. పెరుగన్నం, సాంబారన్నం, పులిహోర, టమాటో రైస్‌తోపాటు గోధుమరవ్వతో కూడిన ఉప్మాను తయారు చేసి పేదలకు ఉచితంగా అందజేస్తోంది. నగరంలోని 50 వార్డుల్లో ప్రత్యేకంగా 50 వాహనాలను ఏర్పాటు చేసి ఆహార పదార్థాలను వితరణ చేస్తోంది. 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.