close

తాజా వార్తలు

Updated : 05/12/2020 20:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మోదీ పేద కుటుంబం నుంచే వచ్చుంటే..

రైతు ఆందోళనకు మద్దతు ప్రకటించిన స్టాలిన్

సేలం: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ శనివారం నిరసన గళం వినిపించారు. తమిళనాడులోని సేలంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ‘ఈ చట్టాలకు వ్యతిరేకంగా మేం న్యాయస్థానానికి వెళ్లాం. కేరళ, పంజాబ్ ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాయి. తాను మొదట రైతునని మా ముఖ్యమంత్రి చెప్పుకుంటారు. కానీ, ఆయన ఇంతవరకు ఎందుకు ఎలాంటి చర్యలకు పూనుకోలేదు?’ అని స్టాలిన్‌ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

‘రైతులు ప్రధాని మోదీపై యుద్ధం చేస్తున్నారు. తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, ఏ ఒక్క రైతూ మరణించకుండా చూస్తానని ఆయన చెప్తుంటారు. కానీ, వాస్తవంగా వేల సంఖ్యలో రైతులు మరణిస్తున్నారు. ప్రధాని నిజంగా పేద కుటుంబం నుంచి వచ్చుంటే వెంటనే పార్లమెంట్‌ సమావేశం ఏర్పాటు చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించేవారు. డీఎంకే దిల్లీలోని రైతుల నిరసనకు మద్దతు ఇస్తుంది’ అని వెల్లడించారు. వ్యవసాయ చట్టాల్లో కనీస మద్దతు ధర గురించి ప్రస్తావించలేదని, రైతులు దాని గురించే డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.

వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ దిల్లీలోని శివారుల్లో పంజాబ్, హరియాణా, ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు 10 రోజులుగా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా కేంద్రం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈ క్రమంలో శనివారం మరోసారి ఇరువర్గాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని