
తాజా వార్తలు
రాష్ట్ర ఆరోగ్య శాఖ నిద్రమత్తులో ఉంది: లక్ష్మణ్
హైదరాబాద్: రాష్ట్ర ఆరోగ్యశాఖ నిద్రమత్తులో తూలుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం సమీక్షలు కూడా నిర్వహించకుండా వ్యవస్థను గాలికొదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో కొవిడ్-19 సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కొవిడ్-19 నివారణకు భాజపా ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో మందుల పంపిణీ కార్యక్రమాన్ని నాంపల్లి భాజపా కార్యాలయంలో లక్ష్మణ్ ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతి రోజు మందుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కొవిడ్-19పై ప్రజలకు ప్రభుత్వం ధైర్యాన్ని ఇవ్వలేకపోతోందన్నారు. హైదరాబాద్‌కు చుట్టుపక్కల ఆసుపత్రులను కట్టిస్తానన్న సీఎం.. ఇప్పుడున్న ఆసుపత్రుల్లో సరైన వైద్యం అందించడం లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ అవినీతి మయమైందని... దీనికి గాంధీ ఆసుపత్రి డాక్టర్ ఆరోపణలే ఉదాహరణగా పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహించండి: హైకోర్టు
- మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి
- 2-1 కాదు 2-0!
- కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
- ఇంకా నయం.. వారినీ తీసేస్తారనుకున్నా: గంభీర్
- రిషభ్ పంత్ కాదు.. స్పైడర్ పంత్: ఐసీసీ
- ఈసారి అత్యధిక ధర పలికే ఆటగాడితడే!
- శంషాబాద్‌లో సిరాజ్‌కు ఘన స్వాగతం..
- మీ పెద్దొళ్లున్నారే... :సెహ్వాగ్
- వైట్‌హౌస్‌లో విచిత్ర పెంపుడు జంతువులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
