60 శాతానికి చేరువగా కరోనా రికవరీ రేటు! 
close

తాజా వార్తలు

Published : 01/07/2020 18:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

60 శాతానికి చేరువగా కరోనా రికవరీ రేటు! 

దిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. నిజానికి గత కొద్ది రోజులుగా ప్రతిరోజూ దాదాపు 19వేల కేసులు నమోదౌతున్నాయి. ఈ క్రమంలో బుధవారం నాటికి మొత్తం కొవిడ్‌ బాధితుల సంఖ్య 5,85,493కి చేరింది. అయితే సంఖ్యను చూసి ఆందోళనకు లోను కానవసరం లేదని... వారిలో 3,47,979 మంది కోలుకున్న విషయాన్ని గమనించాలని పరిశీలకులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం...

* మార్చి నెలాఖరు నాటికి రికవరీ రేటు కేవలం ఏడు శాతం. కాగా, మే ఆరంభంలో ఇది 26 శాతానికి చేరుకుంది.

* మే 18 నాటికి 38 శాతానికి ఎగబాకిన ఈ రేటు... ఆ నెల చివరికల్లా ఏకంగా 47.7కు చేరింది.

* ఇక జులై 1, 2020 నాటికి సుమారు 60 శాతం కావటం సానుకూల పరిణామం. 

ఈ మేరకు భారత ప్రభుత్వం విడుదల చేసిన ఓ ట్వీట్‌లో... ‘‘భారత్‌లో కొవిడ్‌-19 రికవరీ రేటు 59 శాతానికి పైగా ఉంది. ఇది జులై 1, 2020 నాటికి 59.43ను చేరుకుంది. మార్చి 25, 2020 నుంచి లాక్‌డౌన్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి రికవరీ రేటులో క్రమంగా అభివృద్ధి చోటుచేసుకుంది’’ అని ప్రకటించింది.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని