close

తాజా వార్తలు

Published : 24/11/2020 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌లో అసంతృప్తి.. ఇప్పుడు సిద్ధంగా ఉన్నా

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌లో తన బ్యాటింగ్‌ ప్రదర్శనపై అసంతృప్తి చెందానని, అయితే.. ఇప్పుడు టీమ్‌ఇండియాతో సుదీర్ఘ క్రికెట్‌కు సిద్ధంగా ఉన్నానని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ పేర్కొన్నాడు. ఇటీవల యూఏఈలో ముగిసిన మెగా టీ20 లీగ్‌ 13వ సీజన్‌లో స్మిత్‌ కెప్టెన్సీలో రాజస్థాన్‌ దారుణ పరాభవం ఎదుర్కొంది. 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలే సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. తొలుత ఈ జట్టు భారీ విజయాలే సాధించినా తర్వాత పూర్తిగా విఫలమైంది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన స్మిత్‌ 3 అర్ధశతకాలతో 311 పరుగులు చేసి పెద్దగా రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలోనే తన బ్యాటింగ్‌పై అసంతృప్తి చెందానన్నాడు. 

‘ఐపీఎల్‌ జరిగినన్ని రోజులు నా ఆటపై అసంతృప్తితో ఉన్నా. మెగా ఈవెంట్‌లో సరైన లయ అందుకోలేకపోయా. అయితే ఇక్కడికి వచ్చాక నాలో కొత్త ఉత్తేజం పుట్టుకొచ్చింది. ఇప్పుడు నేను బ్యాటింగ్‌ చేయగలననే నమ్మకం కలిగింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నా. పెద్ద టోర్నీల్లో నేను బాగా ఆడడానికి ప్రయత్నిస్తా. దాంతోనే అత్యుత్తమ ప్రదర్శన చేస్తా. అలాంటి సమయాల్లో నాలో తెలియని శక్తి ఏదైనా ఉందేమో తెలియదు’ అని స్మిత్‌ తాజాగా మీడియాతో అన్నాడు. ఇదిలా ఉండగా, భారత్‌, ఆస్ట్రేలియాలు ఈనెల 27 నుంచి మూడు వన్డేల సిరీస్‌తో పాటు మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనున్న సంగతి తెలిసిందే.



Tags :

స్పోర్ట్స్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని