లాభాల్లో స్టాక్ మార్కెట్లు
close

తాజా వార్తలు

Published : 13/07/2020 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని సానుకూలంగా ప్రారంభించాయి. సోమవారం ఉదయం 9:50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 313 పాయింట్లు ఎగబాకి 36,908 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 96 పాయింట్లు లాభపడి 10,865 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.92 వద్ద కొనసాగుతోంది. ఈ వారం వెలువడనున్న కంపెనీల త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇన్ఫోసిస్‌, విప్రో, బంధన్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటి దిగ్గజ కంపెనీలు ఈ వారం ఫలితాలు ప్రకటించనున్నాయి. 

టెక్‌ మహీంద్రా, టాటా మోటార్స్ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇన్ఫోసిస్‌, యూపీఎల్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు స్వల్ప నష్టాల్ని చవిచూస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని