close

తాజా వార్తలు

ఫిబ్రవరి1న కూడా స్టాక్‌మార్కెట్లలో ట్రేడింగ్‌..?

న్యూదిల్లీ: ఈ సారి బడ్జెట్‌ రోజు కూడా స్టాక్‌మార్కెట్లు ట్రేడింగ్‌ను నిర్వహించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ ఫిబ్రవరి1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు శనివారం. కానీ ఈ సారి శనివారం కూడా స్టాక్‌మార్కెట్లు తెరిచే ఉంటాయని ఆంగ్లపత్రిక లైవ్‌మింట్‌ కథనంలో వెల్లడించింది. ఎన్‌ఎస్‌ఈ  కూడా ఆ రోజు పనిచేయవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని ఇప్పటికే కీలకమైన పారిశ్రామిక వేత్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతుండటంతో ఈ అంశంపై తీవ్రంగా దృష్టిపెట్టారు. 
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి దలాల్‌ స్ట్రీట్‌ ట్రేడర్లకు దాదాపు 5సెలవులు తక్కువగా వచ్చాయి. ఈ సారి జనవరి 1వ తేదీన మార్కెట్లు పనిచేసినప్పటికీ మరో రోజు వీరికి సెలవు దక్కలేదు. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్కెట్లకు సెలవు. ఇక ఫిబ్రవరిలో మాత్రం మహాశివరాత్రి సెలవు ఒక్కటి లభించనుంది. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
    ఎక్కువ మంది చదివినవి (Most Read)

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.