close

తాజా వార్తలు

Published : 03/12/2020 16:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 15 పాయింట్ల లాభంతో 44,632 వద్ద స్థిరపడగా.. ఎన్‌ఎసీ నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 13, 133 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు తగ్గి 73.91గా కొనసాగుతోంది. మారుతి సుజుకీ, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, ఆసియన్ పెయింట్స్‌, హిందాల్కో తదితర కంపెనీల షేర్లు లాభపడగా... ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ ,టీసీఎస్‌, బజాజ్‌ ఆటో తదితర షేర్లు నష్టాలను చవి చూశాయి.

అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో పాటు, కొవిడ్‌ టీకా అభివృద్ధిపై సానుకూల వార్తలు వెలువడంతో మదుపర్లు కొనగోళ్ల వైపు మొగ్గు చూపారు. దీనికి తోడు ఫైజర్‌ టీకాను యూకే ప్రభుత్వం అనుమతించడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. దీంతో ఇవాళ ఉదయం నుంచే లాభాల వైపు అడుగులేసిన మార్కెట్లు  అదే పంథాను కొనసాగించాయి.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని