close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 27/05/2020 00:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అసలు.. ధోనీలో గెలిపించే ఉద్దేశమే లేదు!

ప్రపంచకప్‌ సంగతులు చెప్పిన బెన్‌స్టోక్స్‌

ముంబయి: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌-2019లో జరిగిన ఇంగ్లాండ్‌ మ్యాచులో కోహ్లీ, రోహిత్‌ శర్మ భాగస్వామ్యం విస్మయపరిచిందని బెన్‌స్టోక్స్‌ అన్నాడు. ఛేదనలో జట్టును గెలిపించే ఉద్దేశంతో మహేంద్రసింగ్‌ ధోనీ కనిపించలేదని పేర్కొన్నాడు. త్వరలో ఆవిష్కరించనున్న ‘ఆన్‌ఫైర్‌’ అనే పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించాడు.

బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఈ మ్యాచులో ఇంగ్లాండ్‌ 337/7 పరుగులు చేసింది. ఛేదనలో టీమ్‌ఇండియా 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ 59 మీటర్ల బౌండరీ సరిహద్దుల గురించి మాట్లాడటం విచిత్రంగా అనిపించిందని స్టోక్స్‌ అన్నాడు.

‘11 ఓవర్లలో 112 పరుగులు అవసరమైనప్పుడు ధోనీ వచ్చాడు. అతడి ఆటలో అసలు తీవ్రతే కనిపించలేదు. సిక్సర్లు బాదడం కన్నా సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి సారించడం ఆశ్చర్యపరిచింది. రెండు ఓవర్లు మిగిలున్నప్పుడు సైతం భారత్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ధోనీ భాగస్వామి కేదార్‌ జాదవ్‌లోనూ తీవ్రత కనిపించలేదు. నా వరకైతే విరుచుకుపడితేనే గెలుపుకు అవకాశాలు ఉంటాయి’ అని స్టోక్స్‌ ఆ పుస్తకంలో రాశాడు.

‘ధోనీ ఎప్పుడూ చివరి ఓవర్‌ వరకు ఉండి గెలిపించాలనే అనుకుంటాడు. అయితే ఓడిపోయే మ్యాచుల్లోనే అతడు చివరి వరకు నిలిచి లక్ష్యానికి చేరువయ్యేందుకు ప్రయత్నిస్తాడు. ఇక రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ భాగస్వామ్యం విస్మయపరిచింది. మేం చాలా తెలివిగా బౌలింగ్‌ చేశామని తెలుసు. కానీ వారు బ్యాటింగ్‌ చేసిన విధానం మాత్రం మరీ విచిత్రంగా ఉంది. వారు మాపై ఏ మాత్రం ఒత్తిడి పెంచే ఉద్దేశంతో కనిపించలేదు. దాంతో ఆట మా వైపు మళ్లింది. మ్యాచ్‌ ముగిశాక కోహ్లీ బౌండరీ సరిహద్దుల గురించి మాట్లాడం ఆశ్చర్యంగా అనిపించింది. మైదానం ఎలా ఉన్నా రెండు జట్లకూ ఒకేలా ఉంటుంది కదా’ అని స్టోక్స్‌ రాయడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.