
తాజా వార్తలు
ఆ కారును ఆయనకు ఇవ్వండి.. దొంగల లేఖ!
పుణె: మహారాష్ట్రలోని పుణెలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. భీమా కొరేగావ్‌లో అపహరణకు గురైన కారు పక్క ఊర్లో దొరకడమే కాకుండా.. దొరికిన వారు దాన్ని సంబంధిత యజమానికి అప్పగించాలని దొంగలు అందులో లేఖ వదిలివెళ్లడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ లేఖలో కారు యజమాని వివరాలను సైతం పొందుపర్చారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని శిఖర్పూర్ పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకు చెందిన విజయ్ గవానే ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఇటీవల తన డ్రైవర్ ఒకరు కారును తీసుకువెళ్లి భీమా కొరేగావ్‌లోని ఇంటి ముందు పార్క్ చేశాడు. ఈ క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు ధ్వంసం చేసి ఆ కారుతో పరారైనట్లు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కాగా వారు దొరక్కుండా అందులోని జీపీఎస్ వ్యవస్థను సైతం నిలిపివేశారు. కానీ ఇంతలోనే వారు మనసు మార్చుకున్నారు. చోరీ చేసిన కారును సమీపంలోని అహ్మద్‌నగర్‌లో వదిలివెళ్లారు. అంతేకాకుండా వారు అందులో ఓ లేఖను పెట్టి వెళ్లారు.‘ఈ కారును సంబంధిత ట్రావెల్ యజమానికి అందించాలి’అని పేర్కొంటూ ఆయన వివరాలు రాశారు. దీంతో ఆశ్చర్యానికి గురైన పోలీసులు కారును ఆ యజమానిని సమాచారం అందించారు. కాగా దొంగలు కారులో బాధితుడికి చెందిన రూ.55వేల విలువ చేసే సామగ్రిని దోచుకుపోయారని పోలీసులు తెలిపారు.
క్రైమ్
రాజకీయం
జనరల్
సినిమా
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- కల లాంటిది.. నిజమైనది
- భారత్-ఎ జట్టుతో వాళ్లు గెలిచారు: పాంటింగ్
- ఆసీస్ మాజీలూ.. ఇప్పుడేమంటారు?
- మెగాస్టార్ పాత ఫొటో.. గందరగోళంలో రమ్యకృష్ణ!
- భలే పంత్ రోజు..
- గబ్బా హీరోస్.. సూపర్ మీమ్స్
- ఆ విశ్వాసంతోనే వెళ్లిపోతున్నా: ట్రంప్
- ప్రేమోన్మాది ఘాతుకానికి.. యువతి బలి
- రోజూ అనుకునేవాణ్ని.. ఇవాళ గెలిపించాను!
- కష్టాలను దాటి.. మేటిగా ఎదిగి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
