close

తాజా వార్తలు

వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా సుబ్బరాజు..!

హైదరాబాద్‌: టాలీవుడ్‌ నటుడు సుబ్బరాజు వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా దర్శమివనున్నారు. నిజ జీవితంలో అనుకుంటారా? కాదండీ. సినిమాలో. టాలీవుడ్‌ అగ్రకథానాయిక అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. అంజలి, సుబ్బరాజు, మాధవన్‌, షాలినీ పాండే, కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా గత కొన్నిరోజుల నుంచి ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్న వారికి సంబంధించిన పోస్టర్లను చిత్రబృందం ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో సుబ్బరాజు పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో సుబ్బరాజు వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ వివేక్‌గా కనిపించనున్నారని చిత్రబృందం పేర్కొంది.

‘భాగమతి’ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి 31న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్‌లో సోమవారం ఓ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో భాగంగా హైదరాబాద్‌లో అత్యాచారం, హత్యకు గురైన యువవైద్యురాలికి చిత్రబృందం సంతాపం ప్రకటించింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.