టిక్‌టాక్‌ను గూగుల్‌ కొంటోందా..?
close

తాజా వార్తలు

Updated : 27/08/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టిక్‌టాక్‌ను గూగుల్‌ కొంటోందా..?

సీఈఓ సుందర్‌ పిచాయ్‌ వివరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే ఉద్దేశం గూగుల్‌కు లేదని సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) సుందర్‌ పిచాయ్‌ స్పష్టం చేశారు. టిక్‌టాక్‌ సెప్టెంబర్‌ 15లోగా అమెరికాలో కార్యకలాపాలను మూసివేయాలంటూ ట్రంప్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా, మైక్రోసాఫ్ట్‌, ట్విటర్‌ తదితర అమెరికా సంస్థలు దానిని చేజిక్కించుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో ఓ అన్‌లైన్‌ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో.. గూగుల్‌ కూడా ఈ రేసులో ఉందా అనే ప్రశ్నకు పిచాయ్‌ స్పందించారు. ఈ యాప్‌ తమ క్లౌడ్‌ సర్వీసెస్‌ సేవలను ఉపయోగించుకుంటోందని, అందుకు రుసుము చెల్లిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఆ సంస్థను కొనుగోలు చేసే ఆలోచనలో గూగుల్‌ లేదని పిచాయ్‌ వెల్లడించారు. గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ గ్రూప్‌ బిడ్‌లో చేరుదామని తొలుత భావించినా.. అనంతరం విరమించుకున్నట్టు తెలిసింది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని