close

తాజా వార్తలు

Published : 19/11/2020 02:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే

దిల్లీ: కరోనా నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఏపీ ఉద్యోగుల జీతాల చెల్లింపు అంశంపై జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మార్చి, ఏప్రిల్‌లో 50 శాతం జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వ జీవోను కొట్టేస్తూ బకాయిలను 12 శాతం వడ్డీతో 2 నెలల్లోగా చెల్లించాలని ఆగస్టులో ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కరోనా సంక్షోభంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నందున వడ్డీ చెల్లించలేమని ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేసింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం.. 12 శాతం వడ్డీ చెల్లించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధిస్తూ విచారణ వాయిదా వేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన