close

తాజా వార్తలు

Published : 27/11/2020 19:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిన్న తలా సురేశ్‌ రైనా.. హ్యాపీ బర్త్‌డే!

ఇంటర్నెట్ డెస్క్‌: మాజీ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా నేడు తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా తన కుమార్తె పేరున ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థ ‘గ్రేసియా రైనా ఫౌండేషన్‌’ తరపున.. ఉత్తరప్రదేశ్, జమ్ము, దిల్లీ పరిధిలో ఉన్న 34 ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతి సౌకర్యాలు కల్పిస్తానని ప్రకటించాడు. ఈ చర్యతో పదివేలకు పైగా విద్యార్థులకు మేలు కలగనుంది. ధోనీని అనుసరిస్తూ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

రైనా జన్మదినం సందర్భంగా బీసీసీఐ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాయి. ‘‘2011 ప్రపంచ కప్‌ విజేత.. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేత.. అత్యున్నత స్థాయి ఫీల్డర్‌.. సాహసోపేతమైన బ్యాట్స్‌మెన్‌.. రైనాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇంగ్లాండుపై ఆయన సాధించిన అర్థశతకాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుందాం’’ అంటూ బీసీసీఐ తన ట్వీట్‌లో ప్రకటించింది.

ఇక చెన్నై సూపర్‌ కింగ్స్‌ ‘‘రైనాలో నిజంగా ఓ ఆకర్షణ ఉంది. చిన్న తలా (హీరో) సూపర్‌ బర్త్‌డే! ఆల్‌ ది ఎల్లవ్‌ (ఎల్లో+లవ్‌) టు యూ! విజిల్‌ పోడు..’’ అంటూ అభినందించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది ఆ జట్టు తరఫున రైనా ఆడలేకపోయిన విషయం తెలిసిందే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన