close

తాజా వార్తలు

Updated : 01/08/2020 15:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుశాంత్‌ సింగ్‌ చేతిరాతతో..

అపురూప జ్ఞాపకాన్ని పంచుకున్న సోదరి

ఇంటర్నెట్ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఇకలేరనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి శ్వేత సుశాంత్‌కు చెందిన ఓ అపురూపమైన జ్ఞాపకాన్ని పంచుకున్నారు. సుశాంత్‌ తాను భవిష్యత్తులో ఏమేం చేయాలనుకుంటున్నారో రాసుకున్న ‘టు-డూ లిస్ట్‌’ ఉన్న ఓ బోర్డును ఆమె సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు.

దీనిలో.. తాను ఏమేం చేయాలనుకున్నారో సుశాంత్‌ ఓ బోర్డుపై స్వయంగా రాసుకున్నారు. అంతేకాకుండా వీటిని జూన్‌ 29నుంచి ఆచరించాలని కూడా ఆయన దానిపై నోట్‌ చేశారు. ఈ జాబితాలో.. ఉదయాన్నే లేవటం, పుస్తకాలు చదవటం, ధ్యానం చేయటం, వర్కవుట్లు చేయటం, మంచి సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను చూడటం, గిటార్‌ నేర్చుకోవటం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం వంటి అంశాలున్నాయి. అంతేకాకుండా, ‘‘లక్ష్యం వైపు సాగేటప్పుడు నీ భుజాలు (బలం) నలిగిపోవచ్చు, మెలితిరిగి పోవచ్చు... అయితే చెదరని నీ ఆలోచనలు నీ కర్తవ్యం నుంచి నిన్ను దూరం చేయలేవు.’’ అంటూ బిగించిన పిడికిలి మండుతూ ఉన్న చిత్రాన్ని కూడా శ్వేత షేర్‌ చేశారు.

కాగా, సుశాంత్‌ మరణానికి సంబంధించిన కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. నటి రియా చక్రవర్తిపై సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ కేసు నమోదు చేశారు. శుక్రవారం రియాపై మనీ లాండరింగ్‌ కేసు కూడా నమోదైంది. ఆయనకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ లేవనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. కాగా, .. మనం ఊహించలేని పనులను కూడా తలుచుకుంటే చేయగలమంటూ సుశాంత్‌ ఆ బోర్డుపై రాసుకోవడాన్ని గమనిస్తే.. పై వాదనలకు బలం చేకూరినట్టే అని భావిస్తున్నారు. ఈ పరిణామాలతో ‘జస్టిస్‌ ఫర్‌ సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌’ అనే ట్యాగ్‌లైన్ తో ఆయనకు న్యాయం జరగాలనే ప్రచారం నెట్టింట ఊపందుకుంటోంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన