
తాజా వార్తలు
వయసులో చిన్నవాడిని ప్రేమిస్తానని అనుకోలేదు
ముంబయి: ప్రముఖ మోడల్ రోహ్మాన్ షాల్‌తో తనకున్న అనుబంధం గురించి మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ మరోసారి బయటపెట్టారు. వయసులో తనకంటే చిన్నవాడితో ప్రేమలో పడతానని తాను ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ‘సోషల్‌మీడియా వేదికగా నేను రోహ్మాన్ పరిచయమయ్యాం. ఓసారి ఇన్‌స్టాగ్రామ్‌లో రోహ్మాన్ నుంచి నాకు పర్సనల్‌గా మెసేజ్ వచ్చింది. నేను కూడా సమాధానమిచ్చాను. అలా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. కొంతకాలానికి రిలేషన్లోకి అడుగుపెట్టాం. మనం అనుకున్నంత మాత్రాన అన్ని జరిగిపోతాయని నేను నమ్మను. మనకి ఏం జరగాలని రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని భావిస్తా. నిజం చెప్పాలంటే నేను రొమాంటిక్ కాదు. అలాగే వయసులో నాకంటే 15 సంవత్సరాలు చిన్నవాడిని ప్రేమిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రోహ్మాన్ పరిచయం.. ప్రేమ ఎంతో సంతోషంగా ఉంది’’ అని సుస్మితా సేన్ వెల్లడించారు.
అనంతరం ఆమె తన ఫ్యాషన్ గురించి మాట్లాడుతూ.. ‘దుస్తులు, షూస్ విషయంలో నా సౌకర్యానికే మొదటి ప్రాధాన్యం ఇస్తాను. ఫ్యాషన్‌పరంగా నేను తరచూ ప్రశంసలు అందుకోకపోవచ్చు గానీ నా పట్ల నేను ఎంతో సంతోషంగా ఉంటాను. అంతేకాకుండా దుస్తులు, షూస్ తరచూ రిపీట్ చేస్తుంటాను. కేవలం ఫొటోల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చుపెట్టి ఫ్యాషన్‌ని ఫాలో అవ్వడం నాకు నచ్చదు’ అని తెలిపారు.