
తాజా వార్తలు
భవిష్యత్లో మరింత జాగ్రత్త: స్వర్ణలత
సికింద్రాబాద్: ఎవరు చేసుకున్నది వారు అనుభవించక తప్పదని జోగిని స్వర్ణలత అన్నారు. కరోనా నేపథ్యంలో భవిష్యత్లో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉజ్జయిని మహంకాళి బోనాల్లో భాగంగా రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు స్వర్ణలతను ఆవహించి భవిష్యవాణి వినిపించారు. కరోనాపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తన ప్రజలందరినీ కాపాడుకుంటానని చెప్పారు. మరిన్ని గడ్డు రోజులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ‘‘ప్రజలందరినీ సుఖసంతోషాలతో చూస్తానని మాటిస్తున్నాను. గంగాదేవికి జలాలతో అభిషేకం, బోనం చేయండి. అమ్మవారు కరుణించి ప్రజల కోరికలు తీరుస్తుంది. ఐదువారాలపాటు పప్పు, బెల్లంతో శాఖలు సమర్పించండి. మారు బోనం తప్పకుండా సమర్పించండి..ఎలాంటి ఆపద రానివ్వను’’ అని భవిష్యవాణి వినిపించారు.
Tags :