వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాలు..
close

తాజా వార్తలు

Updated : 04/10/2020 15:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వృద్ధురాలి అంత్యక్రియల్లో వానరాలు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా కాలంలో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలకు కుటుంబసభ్యులు, బంధువులే వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో కొన్ని వానరాలు పాల్గొని దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చాయి. ప్రతాప్‌గఢ్‌‌ జిల్లా బెల్హాలో ఓ వృద్ధురాలు మరణించింది. ఆ సమయంలో అక్కడకు చేరిన వానరాలు మృతదేహం చుట్టూ కూర్చున్నాయి. ఓ వానరమైతే  ఏకంగా మృతదేహం ఉన్న మంచంపై కూర్చుని కొంత సమయంపాటు అక్కడే ఉంది. ఈ దృశ్యం దుఃఖంలో ఉన్నవారిని వానరాలు ఓదార్చుతున్నట్లు కనిపించింది. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఈ వింతను చూసేందుకు పెద్దఎత్తున్న అక్కడకు చేరుకున్నారు. ఇలాంటి సంఘటన తమ గ్రామంలో ఎన్నడూ జరగలేదని, ఇది దేవుడి లీలగా వారు పేర్కొన్నారు. వృద్ధురాలి మృతదేహం చుట్టూ సుమారు రెండు గంటలపాటు కూర్చొని ఆ తర్వాత అక్కడినుంచి అవి వెళ్లిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని