‘ఒక్కఛాన్స్‌ అని చివరి ఛాన్స్‌గా మార్చుకున్నారు’
close

తాజా వార్తలు

Published : 22/10/2020 01:08 IST

‘ఒక్కఛాన్స్‌ అని చివరి ఛాన్స్‌గా మార్చుకున్నారు’

సీఎం జగన్‌పై తెదేపా అధినేత చంద్రబాబు విమర్శలు

అమరావతి: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న 30 జిల్లాల్లో 5 ఏపీలోనే ఉండటం బాధాకరమని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాతో రైతులు, పేదలు, చేతివృత్తుల వారు ఆర్థికంగా చితికిపోయారని చెప్పారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను వైకాపా విస్మరించిందని చంద్రబాబు విమర్శించారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ముఖ్యనేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఒక్క ఛాన్స్ అని బతిమాలి తెచ్చుకున్న అధికారాన్ని పదేపదే తప్పుడు పనులు చేస్తూ చివరి ఛాన్స్‌గా సీఎం జగన్‌ మార్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధికి ఇలా గండికొట్టే పార్టీని ఎప్పుడూ చూడలేదన్నారు. రివర్స్‌ పాలనతో రాష్ట్రాభివృద్ధి అంతా రివర్స్‌ చేశారని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని