close

తాజా వార్తలు

సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన

అమరావతి: రైతు సమస్యలపై సచివాలయం ఫైర్‌స్టేషన్‌ వద్ద తెదేపా నిరసన చేపట్టింది. అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. పంటకు గిట్టుబాటు ధరతోపాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. వరి కంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి మాదిరిగా మారిందని అన్నారు. రైతులు పండించిన పంటలు కొనే నాథులే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. దిగిబడి తగ్గినా ఎవరూ కొనట్లేదని అన్నారు.

వేరు సెనగ, పామాయిల్‌, శనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. రైతులకు గిట్టబాటు ధర చెల్లించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆ పార్టీ నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. 6 నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తునే ఉందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే వరకు పోరాటం కొనసాగుతుందని మరో నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. రైతు సమస్యలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

పేదల గొంతు వినిపించడమే తెదేపా నేరమా?:చంద్రబాబు

అంతకుముందు పార్టీ నేతలు, వ్యూహకర్తల కమిటీతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు ఏ మాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు. తెదేపాను అణగదొక్కడంపైనే వైకాపా దృష్టి పెట్టిందన్నారు. పేదల గొంతు వినిపించడమే తెదేపా చేసిన నేరమా? ఉల్లి ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేయడం తప్పా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘ప్రజలను వైకాపా నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఉల్లిపాయలను ఇంటింటికీ డోర్‌ డెలివరీ చేయాలి. ఉల్లి డోర్‌ డెలివరీ చేయకపోతే వాలంటీర్లకు జీతాలు ఎందుకు?. విత్తనాల కోసం క్యూలైన్లలో నిలబడి ముగ్గురు రైతులు మృతి చెందారు. నిన్న ఉల్లి కోసం క్యూలైన్‌లో ఒకరు చనిపోయారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు’’అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.