
తాజా వార్తలు
రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలా?:కళా
అమరావతి: అధికార వైకాపాలో రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చారని ఏపీ తెదేపా అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. లక్షలాది నిరుద్యోగులకు అన్యాయం చేశారని అన్నారు. ఎన్నికల ముందు హోదా తెస్తానన్న సీఎం మాట మార్చారని, కేంద్రం మెడలు వంచైనా ప్రత్యేకహోదా తెస్తామన్న విషయం ఏమైందని ప్రశ్నించారు. పదోతరగతి కూడా పాసుకాని కొడాలి నానికి మంత్రి ఉద్యోగం ఇచ్చి..డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ దుకాణాల్లో బేరరుగా పెట్టారని వ్యాఖ్యానించారు. ఏటా జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి..అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3 లక్షల ఉద్యోగాలు తొలగించారని కళా మండిపడ్డారు.
Tags :