close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 07/02/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నారా లోకేశ్‌కు భద్రత కుదించిన ప్రభుత్వం

అమరావతి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కుదించింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న  వై ప్లస్‌ కేటగిరి (2+2) భద్రతను తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. రేపటి నుంచి 1+1 భద్రత మాత్రమే ఉంటుందని పేర్కొంది. 2014కి ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనూ మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా లోకేశ్‌కు 2+2 భద్రత కల్పించగా.. తెదేపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 4+4కు పెంచారు. ఏవోబీలో మావోయిస్టులు ఎమ్మెల్యేను హతమార్చిన తర్వాత ఓ లేఖ బయటపడటంతో లోకేశ్‌ భద్రతను Z కేటగిరీకి మార్చారు. 4+4 భద్రతతో పాటు అదనపు సిబ్బందిని కూడా నియమించారు. పైలట్‌, రోప్‌ పార్టీ, స్థానిక పోలీసుల భద్రతను కల్పించారు. 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4+4 నుంచి 2+2కు.. తాజాగా 1+1కు భద్రతను కుదించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.