close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120036483 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => qpEMkXvE4qI [video_short_link] => qpEMkXvE4qI [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-03-16 16:53:56.797835 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

సీఎస్‌ లేఖ రాజ్యాంగ విరుద్ధం: యనమల

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాసిన లేఖ రాజ్యాంగ విరుద్ధమని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సీఎస్ రాసిన లేఖను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల అధికారికి సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని యనమల డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఒకసారి ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించాక ఇక ప్రభుత్వ పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికలు వాయిదా వేయడానికి ఎస్‌ఈసీ ఎవరు? అని సీఎం బెదిరించడమేంటని యనమల ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతో ఎస్ఈసీకి సీఎస్‌ లేఖ రాయడం వల్ల వాళ్లిద్దరి చర్యలూ రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తాయన్నారు. 

ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలను ఎస్ఈసీకి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. సీఈసీకి ఉన్న అధికారాలన్నీ ఎస్ఈసీకీ ఉన్నాయని సుప్రీంకోర్టే చెప్పిందని..అలాంటిది ఎస్ఈసీ అధికారాన్ని సీఎం జగన్ ఎలా ప్రశ్నిస్తారని యనమల నిలదీశారు. సీఎం జగన్ దుర్మార్గ పాలనను రాజ్యాంగాధినేతలే చక్కదిద్దాలని కోరారు.

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిందని, జాతీయ విపత్తుగా కేంద్రం ప్రకటించిందని యనమల గుర్తు చేశారు. కరోనా వస్తుంది.. పోతుందంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడటమేనని దుయ్యబట్టారు. 151 సీట్లు వచ్చాయని ఇష్టారాజ్యంగా చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదని యనమల హెచ్చరించారు. 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.