‘జగన్‌ బినామీల కోసమే రసాయన పరిశ్రమలు’
close

తాజా వార్తలు

Updated : 10/12/2020 12:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జగన్‌ బినామీల కోసమే రసాయన పరిశ్రమలు’

తెదేపా నేత యనమల రామకృష్ణుడు

విజయవాడ: కోనసీమ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గతంలో దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించినట్లు నటించిన వైకాపా.. ఇప్పుడు అనుమతి ఇవ్వడంలో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ఈ రసాయన పరిశ్రమల ఏర్పాటు వల్ల సముద్రజలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములన్నీ ఉప్పు తేలడంతో రైతులకు ఎనలేని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 300పైగా హేచరీలు కూడా కాలుష్యంలో చిక్కుకుని చిరు వ్యాపారులంతా పూర్తిగా దెబ్బతింటారని పేర్కొన్నారు. వాళ్ల ఆదాయాలు క్షీణించడమే కాకుండా ప్రభుత్వ రాబడి కూడా పడిపోతుందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు.  

సముద్రజలాలన్నీ కలుషితమై, అసలు చేపల వేటే లేకపోతే ఫిషింగ్ హార్బర్‌ ప్రతిపాదన అంతా దారుణ మోసమేనని యనమల పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటును కూడా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కాకినాడ సెజ్‌లో 51 శాతం షేర్లను రూ.2511 కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేశారని అన్నారు. జగన్‌ బినామీలు బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమల ఏర్పాటు ద్వారా కోనసీమ ప్రాంతంలోని గ్రామాలను కబ్జా చేసి, తీర ప్రాంతాన్ని ఆక్రమించి తమ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ స్థాపనకు యత్నిస్తున్నారని యనమల ఆరోపించారు. ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను తక్షణమే జగన్ రెడ్డి ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉత్పన్నం అయ్యే దుష్పరిణామాలకు జగన్‌ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని యనమల హెచ్చరించారు. 

ఇవీ చదవండి..
రైతుల ఆందోళన ప్రభుత్వానికి పట్టదా: చంద్రబాబు

‘ఏలూరు అస్వస్థతపై ఎందుకంత ఉదాసీనత?’Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని