close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120074966 [video_srlno] => 1 [video_type] => 1 [video_link] => kVWsT1UbY8Y [video_short_link] => kVWsT1UbY8Y [created_by] => [created_date] => [modified_by] => 9030304 [modified_date] => 2020-06-12 19:42:51.956998 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 12/06/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అచ్చెన్న అరెస్టు అత్యంత దారుణం:చంద్రబాబు

హైదరాబాద్‌: టీడీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన తీరు అత్యంత దారుణంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా తీసుకొచ్చి అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధి పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు గర్హనీయమన్నారు. ఇటీవలే శస్త్ర చికిత్స జరిగిన వ్యక్తిని ఇలా రాష్ట్రమంతా తిప్పడం ఏంటని ప్రశ్నించారు. అధికారం ఉందని ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలా అచ్చెన్నాయుడిని అవమానించారని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

‘‘విజిలెన్స్‌ నివేదికలో అచ్చెన్నాయుడు పేరు ఎక్కడైనా ఉందా?పర్చేజ్‌‌ మాన్యువల్‌లో మంత్రి పాత్ర ఉందని ఎక్కడా లేదు. అనిశా నివేదికను మారుస్తారా? మైనింగ్‌, భూఅక్రమాలపై పోరాటం వల్లే ఈ వేధింపులా? ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై పోరాటం వల్లే ఈ దాడులా?మీ దోపిడీని అడ్డుకుంటున్నామనే ఇలాంటివి చేస్తున్నారు. ఈ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయాయి. కల్పిత కథను తీసుకొచ్చి అచ్చెన్నాయుడిపై తప్పుడు కేసులు పెట్టారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవి నవమోసాలు..

‘‘వైకాపా ప్రభుత్వానివి నవరత్నాలు కాదు.. నవ మోసాలు. రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసేందుకే ఒక్క ఛాన్స్‌ అడిగారు. రూ. 87 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? రాష్ట్రంలోని సహజ నవరులను దోచుకుంటున్నారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా అయిందని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు, భోగాపురం ఎయిర్‌పోర్టు పరిస్థితి ఏమిటి? మీ పాలనను ప్రజలు ప్రశ్నించేసరికి మాపై దాడులు చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆక్షేపించారు.

పోలీసులే జవాబుదారీ అవుతారు..

‘‘తాను ఏ తప్పూ చేయలేదని అచ్చెన్నాయుడు చెప్పారు. చట్టం ఉల్లంఘించి పనిచేసే పోలీసులు తర్వాత జవాబుదారీ అవుతారు. 40 ఏళ్లలో ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు. రాజ్యాంగ ఉల్లంఘన అడుగడుగునా జరుగుతోంది. రాజ్యాంగ సంస్థలతో ఆడుకోవద్దని సుప్రీంకోర్టే చెప్పింది. అచ్చెన్నాయుడికి కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్టు చేస్తారా? బీసీలు, ఎస్సీలపై దాడులు విపరీతంగా పెరిగాయి. తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తామంటున్నారు. మీ ఆటలు సాగనివ్వం, వాటిని అడ్డుకుంటాం. వెనుకబడిన వర్గాలపై దాడులు ఆపేవరకు పోరాడతాం’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఏడాదిలోనే చేశారు..

‘‘చట్టపరంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రవర్తించండి. బెదిరిస్తాం, బ్లాక్‌మెయిల్‌ చేస్తామంటే కుదరదు. బెదిరిస్తే భయపడేందుకు ఇక్కడ ఎవరూ లేరు. వైకాపా నేతలు తమ మాటలు, భాష సరిచేసుకోవాలి. రాజ్యాంగానికి లోబడే ఎవరైనా పనిచేయాలి. 50 ఏళ్లలో చేసే అవినీతి ఏడాదిలోనే చేశారు. రాజ్యాంగానికి లోబడే ఎవరైనా పనిచేయాలి. రాజ్యాంగ ఉల్లంఘన చేయవద్దని అంబేడ్కర్‌ ఆనాడే చెప్పారు. రాజ్యాంగం, చట్టాలు, ప్రాథమిక హక్కులను రక్షిస్తూ పరిపాలన చేయాలి’’ అని చంద్రబాబు తెలిపారు.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.