ఆదుకోవాల్సిన చోటే లాఠీలు విరుగుతున్నాయ్‌
close

తాజా వార్తలు

Published : 19/05/2020 03:48 IST

ఆదుకోవాల్సిన చోటే లాఠీలు విరుగుతున్నాయ్‌

దేవినేని ఉమ విమర్శ

అమరావతి: రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ పాలనపై తెలుగుదేశం నేతలు ట్విటర్‌ ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఏపీ ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా నాసిరకం బియ్యం, శనగలు ఇస్తోందని దేవినేని ఉమ విమర్శించారు. అసలు తినేటట్లు లేని ఈ సరకులను ప్రజాప్రతినిధుల ఇళ్లలో వండించగలరా? అని నిలదీశారు. మరోవైపు ఉన్నత న్యాయస్థానం తీర్పులను లెక్కచేయకుండా వలస కార్మికులను మళ్లీ కొట్టారని దేవినేని మండిపడ్డారు. అన్నం, మంచి నీళ్లు ఇచ్చి ఆదుకోవాల్సిన చోట లాఠీలు విరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతూళ్లకు పంపిచమని కోరుతున్న వలస కూలీలపై ప్రతాపం చూపటం ఆటవిక రాజ్యమో? లేదా ప్రజాస్వామ్యమో? ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డే సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్‌ చేశారు. 

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ రాష్ట్రంలోని వ్యాపారస్థులను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్నారని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. దుర్గగుడిని మొత్తం దోచేస్తూ వినాయకుడి గుడినీ వదలటం లేదని విమర్శించారు. వ్యాపారస్థులను బెదిరించి మరీ దండుకుంటున్న మంత్రిని చూసి విజయవాడ మొత్తం వణికిపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని