కాగడాలతో తెదేపా రాష్ట్రవ్యాప్త నిరసన
close

తాజా వార్తలు

Updated : 14/06/2020 22:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాగడాలతో తెదేపా రాష్ట్రవ్యాప్త నిరసన

అమరావతి: ప్రలోభాలకు లొంగని తెలుగుదేశం నేతలపై సీఎం జగన్‌ కక్ష సాధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ నేతల అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. అందులో భాగంగా అమరావతి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ నేతలు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, బొండా ఉమాతో కలిసి కాగడా పట్టుకుని నిరసన తెలియజేశారు. ఏడాది పాలనలో కక్ష సాధింపు చర్యలే తప్ప చేసిందేమీ లేదన్నారు. పులివెందుల రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ప్రతిపక్ష పార్టీల నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేస్తూ పార్టీ నేతలు నిరసన తెలియజేశారు. గుంటూరులో ఎంపీ గల్లా జయదేవ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, మాజీ ఎంపీ మాగంటి బాబు వారి గృహాల వద్దే అచ్చెన్నాయుడు, ప్రభాకర్‌ రెడ్డి, చింతమనేనిని వెంటనే విడుదల చేయాలంటూ కాగడాలతో నిరసన తెలియజేశారు. విశాఖలోనూ తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు.

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని