రూ.25 కోట్లతో అల్ట్రా మోడరన్‌ శీతల గిడ్డంగి
close

తాజా వార్తలు

Updated : 11/07/2020 20:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రూ.25 కోట్లతో అల్ట్రా మోడరన్‌ శీతల గిడ్డంగి

ఉన్నతాధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: ఇప్పటి వరకు 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు అందిందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో వ్యవసాయ రంగం, రైతుబంధుపై సమీక్ష సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. 100 శాతం నియంత్రిత పద్ధతిలో సాగు చేయడం శుభసూచకమన్నారు. భవిష్యత్తులో సాధించే విజయానికి ఇది నాంది అని చెప్పారు. విత్తనాభివృద్ధి సంస్థ ఉత్పత్తి చేసే విత్తనాల నిల్వకు శీతల గిడ్డంగి నిర్మిస్తామని పేర్కొన్నారు. రూ. 25 కోట్లతో అతిపెద్ద అల్ట్రా మోడరన్‌ శీతల గిడ్డంగి నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. దసరా నాటికి రైతు వేదిక నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 
రైతు బంధు అందని రైతులను గుర్తించి సాయం చేయాలని స్పష్టం చేశారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని