close

తాజా వార్తలు

Published : 09/08/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. విజయవాడ: కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం

విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్‌ ఆసుపత్రి కొవిడ్‌కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలస్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమంచి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హోటల్‌లో 40మంది వరకు ఉన్నట్టు సమాచారం. వీరిలో 30మంది కొవిడ్‌ బాధితులు కాగా 10మంది ఆసుపత్రి సిబ్బంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

విజయవాడ అగ్ని ప్రమాదంపై సీఎం ఆరా

2. కొత్త ప్రాజెక్టులు ఆపండి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్‌ ప్రక్రియను, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మూడో టీఎంసీ ఎత్తిపోత సహా ఏడు ప్రాజెక్టుల పనులను ఆపాలని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ సూచించారు. కృష్ణా బేసిన్‌లో ఆంధ్రప్రదేశ్‌, గోదావరి బేసిన్‌లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులలో పరస్పరం రెండు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకొన్న వాటిని ఆపాలని కోరారు. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా ప్రాజెక్టులను చేపట్టవద్దని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

3. 3రాజధానులకు శంకుస్థాపన 16న?

మూడు రాజధానుల శంకుస్థాపన కార్యక్రమాన్ని ఈనెల 16న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా గానీ, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గానీ పాల్గొనాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయన అపాయింట్‌మెంట్‌ కోరారు. మూడు రాజధానులతో పాటు, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలోనూ పాల్గొనాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించాలని భావిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

4. సాటిలేని పైలట్‌ సాథే

ఓసారి ఆయనను అదృష్టం వరించింది. రెండోసారి మాత్రం కలిసిరాలేదు. మృత్యువుదే పైచేయి అయింది. శుక్రవారం కేరళలోని కొజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన పైలట్‌ కెప్టెన్‌ దీపక్‌ సాథే గతంలో ఇలాంటి గండం నుంచి బయటపడ్డారు. తీవ్రగాయాలై, ఆరు నెలలు ఆసుపత్రిలోనే ఉన్నా.. విమానాలు నడపడంపై మక్కువ తగ్గలేదు. మొక్కవోని పట్టుదలతో గాయాలను జయించి, తిరిగి విజయవంతంగా విధుల్లో చేరగలిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

పైలట్ల అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు

5. 12న తొలి కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌!

ప్రపంచంలోనే తొలి కరోనా వ్యాక్సిన్‌ను ఈనెల 12న రష్యా అధికారికంగా రిజిస్టర్‌ చేయనుంది! మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న క్రమంలో అన్ని దేశాలూ కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలోనే... తాము చివరి దశ పరీక్షలను పూర్తిచేసి, వచ్చే బుధవారం తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేయనున్నట్టు రష్యా ప్రకటించింది. ఈ టీకాను గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ శాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ మూడో దశ పరీక్షలు పూర్తిచేసుకుంటోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

6. ముఖేశ్‌ ప్రపంచంలో నం.4

ప్రపంచ కుబేరుల జాబితాలో ముకేశ్‌ అంబానీ మరో మెట్టు అధిరోహించారు. ఐరోపాకు చెందిన ఎల్‌వీఎంహెచ్‌ ఛైర్మన్‌ బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ను తోసిరాజని నాలుగో స్థానంలోకి చేరారు. టాప్‌-10లోకి చేరిన కొద్ది వారాల్లోనే ఆయన ఈ స్థాయికి చేరడం గమనార్హం. ఇదే జోరు కొనసాగిస్తే.. మార్క్‌ జుకర్‌బర్గ్‌ను సైతం వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరినా ఆశ్చర్యం లేదు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నికర విలువ 80.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.6.04 లక్షల కోట్లు)కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

7. మధుమేహుల్లో ‘నాచ్‌’ పునరుత్తేజితం

మధుమేహుల్లో ‘నాచ్‌’ సంకేత మార్గం పునరుత్తేజితం కావడంతో మూత్రపిండా(కిడ్నీ)ల్లో ఉండే పోడోసైట్స్‌ దెబ్బతిని మూత్రం ద్వారా ప్రొటీన్లు బయటకు పోతున్నాయిని హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయ(హెచ్‌సీయూ) పరిశోధక బృందం గుర్తించింది. కిడ్నీల్లోని పోడోసైట్స్‌ను అడ్వాన్సుడ్‌ గ్లైకేషన్‌ ఎండ్‌ ప్రొడక్ట్స్‌(ఏజీఈ) ఎలా దెబ్బతీస్తున్నాయనే అంశంపై ఆ వర్సిటీ లైఫ్‌సెన్సెస్‌ విభాగం ఆచార్యుడు డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ పసుపులేటి, జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) శాస్త్రవేత్త డాక్టర్‌ భానుప్రకాశ్‌రెడ్డితో కూడిన బృందం పరిశోధించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

8. 2,200 ఏళ్ల నాటి బ్రాహ్మీ శాసనం

తెలంగాణ చరిత్రకు సంబంధించి మరో ఆధారం 2,200 ఏళ్ల నాటి శాసనం లభించింది. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్‌తుమ్మెదలో క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి లఘు శాసనం దొరికిందని పురావస్తు నిపుణుడు, బుద్ధవనం ప్రాజెక్టు కన్సల్టెంట్‌ ఎంఏ శ్రీనివాస్‌ శనివారం వెల్లడించారు. వై.భానుమూర్తి (చీఫ్‌ కేర్‌టేకర్‌ తెలంగాణ ప్రభుత్వ హెరిటేజ్‌ శాఖ), బి.శంకర్‌రెడ్డి (పురావస్తు అన్వేషకుడు)తో కలిసి మంజీరా నదీ పరివాహక ప్రాంతంలో జరుపుతున్న అన్వేషణలో తమకు ఈ శాసనం దొరికిందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

9. ఫ్రాంఛైజీలకు ఎంత నష్టం?

ఈ ఏడాది ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వివో తప్పుకున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలకు వాటిల్లే నష్టంపై చర్చలు మొదలయ్యాయి. అయిదేళ్లకు (2022 వరకూ) గాను కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వివో ఏడాదికి సుమారు రూ.440 కోట్లు బీసీసీఐకి చెల్లించేది. దాంట్లో సగం ఫ్రాంఛైజీలకు దక్కేది. అంటే ఒక్కో ఫ్రాంఛైజీకి రూ.20 కోట్లకు పైనే ఖాతాలో చేరేది. కానీ రాబోయే సీజన్‌కు వివో దూరం కావడంతో ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అంత మొత్తంలో చెల్లించే మరో స్పాన్సర్‌ దొరకడం కష్టమేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​

10. రానా మిహీకం

గ్గుబాటివారింట పెళ్లి బాజాలు మోగాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా కొనసాగుతూ వచ్చిన యువ కథానాయకుడు రానా దగ్గుబాటి ఒకింటివాడయ్యారు. తన స్నేహితురాలు మిహీకా బజాజ్‌ మెడలో మూడు ముళ్లు వేశారు. వీరి వివాహ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన పెళ్లి మంటపంపై, పరిమిత సంఖ్యలో బంధువులు, అతిథుల సమక్షంలో మిహీకాతో కలిసి ఏడడుగులు వేశారు రానా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి​​​​​​​


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.