close

తాజా వార్తలు

Published : 11/08/2020 08:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 AM

1. ఏందీ రాద్ధాంతం!

రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అర్థంపర్థం లేని.. నిరాధారమైన అనవసర రాద్ధాంతం చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం కూడా తప్పుడు విధానం అవలంబిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో పూర్తి వాస్తవాలు, సంపూర్ణ సమాచారంతో సమర్థ వాదనలు వినిపించాలని నిర్ణయించారు. ఇటు ఏపీ ప్రభుత్వానికి, అటు కేంద్రానికి గట్టి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 9 నుంచి ఎంసెట్‌

పాఠశాలల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు ఎప్పుడు మొదలవుతాయి?...ఆగిపోయిన ఎంసెట్‌, ఇతర ప్రవేశ పరీక్షలు మళ్లీ జరిగేదెన్నడు?...ఇంటర్‌ ప్రవేశాలకు ఎప్పటి నుంచి శ్రీకారం చుడతారు?.. దోస్త్‌ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ముహూర్తం ఎప్పుడు?...ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం సోమవారం స్పష్టత ఇచ్చింది. విద్యాసంస్థలు ఎప్పటి నుంచి తెరుచుకుంటాయన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వకున్నా డిజిటల్‌ తరగతుల మొదలు, ప్రవేశ పరీక్షల తేదీలు, ప్రవేశాలకు ముహూర్తాలు ఖరారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఫ్లాట్లు కొన్నవారి పాట్లు

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు సొంతిల్లు జీవితకాలం స్వప్నం. నెలకు రూ.50-60 వేల జీతం వచ్చే ఒక ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రైవేటు ఉద్యోగైనా ఒక ఫ్లాట్‌ కొనుక్కోవాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి. దాచుకున్న ప్రతి రూపాయీ వెచ్చించాలి. బ్యాంకుల చుట్టూ తిరిగి రుణం తీసుకోవాలి. ఆ తర్వాత 15-20 ఏళ్లపాటు బ్యాంకులకు వాయిదాలు కట్టాలి. అలా కొన్న ఇంటికో, ఫ్లాట్‌కో రాబోయే రోజుల్లో ధర పెరుగుతుందని, తమ పిల్లలకు ఒక ఆస్తిగా, భవిష్యత్తుకు భరోసాగా ఉంటుందని ఆశ పడతారు. ఉద్యోగం, వ్యాపారం, పిల్లల చదువుల కోసం వేరే చోట ఉండాల్సి వచ్చినా ఫ్లాట్‌ను అద్దెకు ఇవ్వొచ్చని అనుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఇసుక రవాణా ధర నిర్ణయం

4. ఏది అభివృద్ధి? ఏది విధ్వంసం?

రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్రలో రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు. రాయలసీమకు జీవనాడి అయిన ముచ్చుమర్రిలాంటి ప్రాజెక్టుల్నీ పూర్తి చేయకుండా.. రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ పేరుతో లేనిపోని గొడవలు పెట్టి ఏం సాధించారని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును తాము 72% పూర్తి చేస్తే.. వైకాపా ప్రభుత్వం వచ్చాక దాన్నీ ముందుకు సాగకుండా చేశారని ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ముందే గుర్తిస్తే ముప్పు తప్పేది

స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్నికీలలు, దట్టమైన పొగ పూర్తిగా వ్యాపించడానికి 30-45 నిమిషాల ముందే ప్రమాదం మొదలై ఉంటుందని అగ్నిమాపక శాఖాధికారులు అంచనాకు వచ్చారు. అయితే ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉండటంపొగను గుర్తించి అప్రమత్తం చేసే రక్షణ వ్యవస్థ సక్రమంగా లేకపోవటం పెను ప్రమాదానికి దారితీసిందని తేల్చారు. ఈ రెండింటిలో ఏది ఉన్నా..మంటను ప్రారంభంలోనే గుర్తించి దాన్ని కట్టడి చేసి, ఆర్పివేసేందుకు ఆస్కారం ఉండేదని నిర్ధారణకు వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

‘స్వర్ణ ప్యాలెస్‌’లో ఆధారాలు లభ్యం

6. సొంత గూటికి సచిన్‌ పైలట్‌?
 రాజస్థాన్‌లో నెల రోజులుగా నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభన కీలక మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురువే తన వర్గంలోని 18 మంది ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించిన అసమ్మతి నేత సచిన్‌పైలట్‌ తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరుకోనున్నారు. పార్టీ అధిష్ఠానంతో చర్చలు జరిపిన ఆయన ఆ మేరకు కొన్ని హామీలను పొందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన పరిణామాలు దిల్లీ, జైపుర్‌లలో చోటుచేసుకున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
7. ఈ విద్యా సంవత్సరం వృథా పోనివ్వం
ప్రస్తుత విద్యా సంవత్సరం ‘జీరో ఇయర్‌’గా ముగియదని, పరీక్షలు జరుపుతామని పార్లమెంటరీ సంఘం ముందు కేంద్ర విద్యాశాఖ అధికారులు ఆశాభావం వ్యక్తంచేశారు. విద్యాసంవత్సరం చివర్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌ క్లాసులు కూడా మూడో తరగతి దాటిన వారికి మాత్రమేనని, ఎనిమిదో తరగతి వరకు వాటి సంఖ్యను కూడా పరిమితం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు.. చరవాణులు, ల్యాప్‌ట్యాప్‌లు, కంపూటర్లు లేని బీద విద్యార్థుల సంగతేంటని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
నవ్వులు పూయించే అల్లరి పనులు.. ముద్దుగొలిపే చిలిపి చేష్టలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ శ్రీకృష్ణుడు. చిన్నతనంలో ఆ కృష్ణయ్య తన అల్లరి చేష్టలతో చూపిన మాయలు, బోధించిన సత్యాలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి చిలిపి పనులు ఆ వెన్నదొంగే కాదు.. చిన్నతనంలో మేమూ చాలానే చేశామంటున్నారు మన తెలుగు తెర గోపికమ్మలు. నాన్నకు తెలియకుండా చేసిన దొంగతనాలు, పక్కింట్లో కొట్టుకొచ్చిన మామిడి కాయలు.. ఇలా చాలా తుంటరి పనులే చేశారట. చిన్నతనంలో నాయికలు చేసిన ఆ అల్లరి పనులేంటో ‘శ్రీకృష్ణజన్మాష్టమి’ సందర్భంగా సరదాగా వారి మాటల్లోనే... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
9. టీకా ఎక్కడ?
కొవిడ్‌ నేపథ్యంలో నగరంలో చిన్నారులకు సమయానికి ఇతర వ్యాధి నిరోధక టీకాలు అందడం లేదు. కరోనా విధులతో చాలామంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు. అంతేకాక ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కరోనా కోసం ర్యాపిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఇవి జరుగుతుండటంతో వైద్య సిబ్బంది ఇతర కార్యకలాపాలను వాయిదా వేయాల్సి వస్తోంది. దీంతో ఆయా కేంద్రాలకు చిన్నారులను తీసుకువెళ్లినా.. వారికి వైద్య సిబ్బంది టీకాలు వేసే పరిస్థితి ఉండటం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

పొగ తాగితే.. 28 రోగాలు

10. ఐపీఎల్‌పై ఏడుపెందుకు?

ఐపీఎల్‌ అంటే విదేశీయులకే కాదు.. భారతీయుల్లో కూడా కొందరికి ఎందుకంత అసూయ అని ప్రశ్నిస్తున్నాడు సునీల్‌ గావస్కర్‌. ఇంగ్లాండ్‌ బయో బబుల్‌ పద్ధతిలో ఆడుతున్న సిరీస్‌లకు ఐసీసీ స్థానిక అంపైర్లను కేటాయించడాన్ని తప్పుబడుతున్నాడాయన. ఈ ఆసక్తికర అంశాలపై సన్నీ రాసిన వ్యాసం ‘ఈనాడు’కు ప్రత్యేకం. ప్రపంచం కొవిడ్‌-19తో పోరాటాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు బీసీసీఐ చాలా ఏళ్లుగా ‘అసూయ’ అనే వైరస్‌తో పోరాడుతోంది. 2008లో వచ్చిన ఈ వైరస్‌.. ఏటా వచ్చి పోతుంది. ఐపీఎల్‌ మొదలవడానికి ముందు మొదలై.. అది ముగిసిన రెండు వారాల దాకా ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ ఉన్న అయిదు క్రీడా ఈవెంట్లలో ఒకటిగా ఐపీఎల్‌ ఎదిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.