close

తాజా వార్తలు

Published : 10/08/2020 12:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించిన ఏపీ

రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. 2020-23 సంవత్సరాలకు ఈ పారిశ్రామిక విధానం అమల్లో ఉంటుంది. పారిశ్రామిక అనుమతుల వేగవంతానికి వైఎస్‌ఆర్‌ ఏపీ వన్‌ పేరిట సింగిల్‌ విండో కేంద్రాన్ని పరిశ్రమల శాఖ ఏర్పాటు చేసింది. నూతన పాలసీని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌లో మరో పైవంతెన అందుబాటులోకి..

మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద కుడివైపు పైవంతెనను ఎస్‌ఆర్‌డీపీ ప్యాకేజీ-2లో భాగంగా రూ.26.45 కోట్లతో నిర్మించారు. దీంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రింగ్‌రోడ్‌ జంక్షన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అండమాన్‌కు ముందే లభించిన బహుమతి

చెన్నై, పోర్టు బ్లేయర్‌ల మధ్య సముద్ర గర్భంలో ఏర్పాటైన ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ (ఓఎఫ్‌సీ) వ్యవస్థను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమంలో నేడు ప్రారంభించారు. క్షణానికి 2X200 జీబీపీఎస్‌ బ్యాండ్‌ సామర్థ్యం గల ఈ కేబుల్‌ లింక్‌ వల్ల.. పోర్ట్‌ బ్లేయర్‌తో సహా ఇతర అండమాన్‌ ద్వీపాల ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం శంకుస్థాపన ప్రధాని పోర్టు బ్లేయర్‌లో డిసెంబర్‌ 30, 2018న చేతుల మీదుగా జరిగిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కేరళ విమాన ప్రమాదం: తొలి 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే  

 కేరళలోని కొలికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదం ఇప్పటి వరకు 19 మందిని పొట్టన పెట్టుకుంది. శుక్రవారం ఐఎక్స్‌ 1355 ఎయిర్‌ ఇండియా విమానం ఇక్కడి టేబుల్ టాప్‌ రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న సమయంలో అదుపు తప్పటంతో ఈ దుర్ఘటన సంభవించింది. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి భారత్‌కు వచ్చిన ప్రవాస భారతీయులు.. మరికొద్ది సేపట్లో తమ స్వస్థలాలకు చేరుతారనగా జరిగిన ఈ దుర్ఘటన దేశం మొత్తాన్ని కలవరపరచింది. కాగా, అంతవరకు సాఫీగా సాగిన ప్రయాణం చివరిలో ఏమైందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో ఒక్కరోజే 1007 మంది మృత్యువాత!

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరింది. గత కొంతకాలంగా నిత్యం రికార్డుస్థాయిలో 900లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 1007మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. ఒకేరోజు వెయ్యిమంది చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల మరణాల రేటు 2శాతంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో కొత్తగా 1,256 పాజిటివ్‌ కేసులు

6. మాజీ మంత్రి పెన్మత్స కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు(89) కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నేత ఆయన. 1989-94లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గజపతినగరం, సతివాడ శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వెయ్యికోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టివేత!

ముంబయిలో పెద్తఎత్తున మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నవీ ముంబయిలోని పోర్టులో 191 కిలోల మాదకద్రవ్యాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ముంబయిలో ఈ స్థాయిలో పట్టుబడటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. వీటిని సరఫరా చేస్తున్న ఇద్దరు నిందితులను ముంబయి డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మాదకద్రవ్యాలను అఫ్ఘానిస్థాన్ నుంచి ముంబయికి తీసుకొచ్చినట్లు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చాహల్‌కు కాబోయే సతీమణి గురించి తెలుసా?

టీమ్‌ ఇండియా ఆటగాడు చాహల్‌ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ధనశ్రీ వర్మను తాను వివాహం చేసుకోబోతున్నానంటూ శనివారం ఈ స్పిన్నర్‌ ప్రకటించాడు. ధనశ్రీ వృత్తిపరంగా వైద్యురాలే అయినప్పటికీ ఆమె యూట్యూబ్‌ స్టార్‌గానే ఎక్కువ మందికి పరిచయం. ఆమె కొరియోగ్రఫీ చేసిన కొన్ని వీడియోలకు లక్షలకొద్దీ వ్యూస్‌ లభించడం గమనార్హం. మైదానంలో ఎప్పుడూ ఉత్సాహంతో కనిపించే చాహల్‌లానే ధనశ్రీ సైతం అంతే యాక్టివ్‌గా ఉంటుందని ఆమె సోషల్‌ మీడియా ఖాతాలను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాకు పిచ్చిపట్టిందనుకున్నారు: విద్యాబాలన్‌  

డర్టీ పిక్చర్‌ సినిమాకు సంతకం చేసినప్పుడు తనకు పిచ్చి పట్టిందని కొందరు భావించారని బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ చెప్పుకొచ్చారు. పక్కింటి అమ్మాయి అనిపించేంతగా దగ్గరైన తాను ఇలాంటి చిత్రాలు చేయకూడదని సూచించారు. బాలీవుడ్‌లో ఘనవిజయం సాధించిన డర్టీ పిక్చర్ చిత్రం అలనాటి తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో తన పాత్రకు ప్రాణం పోసి విద్య జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ ముగ్గురిలో ధోనీ ఒక్కడు  

క్రికెట్‌ ఫీల్డ్‌లో తాను చూసిన అత్యంత తెలివిగల ఆటగాళ్లలో టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ ఒకరని ప్రముఖ అంపైర్‌ సైమన్‌ టౌఫెల్‌ అన్నాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో మాట్లాడిన అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు. ధోనీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు షేన్‌వార్న్‌, డారెన్‌ లెహ్మన్‌లు కూడా తెలివిగల వారని మెచ్చకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.