close

తాజా వార్తలు

Published : 12/08/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. రష్యా వ్యాక్సిన్‌: పరిశోధన సమాచారంపై విమర్శలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు వ్యాక్సిన్‌ తయారు చేసినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అంతర్జాతీయ నిపుణులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగ పరీక్షలు ఫలితాల సమాచారాన్ని ఎక్కడా వెల్లడించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం రెండు నెలల ప్రయోగాల అనంతరం వ్యాక్సిన్‌ ఆమోదాన్ని ప్రకటించడంపై పెదవివిరుస్తున్నారు. ఇలాంటి సమయంలో వ్యాక్సిన్‌ను నమ్మడం కష్టమని బ్రిటన్‌, జర్మనీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం

అగ్రరాజ్యం అమెరికాలో మరో భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం దక్కింది. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రట్‌ అభ్యర్థిగా బరిలో నిలవనున్న జో బిడెన్‌ ..ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా భారత సంతతి మహిళ కమలా హారిస్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎంపికైన తొలి నల్లజాతి వ్యక్తిగా కమలా హారిస్‌ చరిత్ర సృష్టించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మహిళల చెంతకే వ్యాపార అవకాశాలు: జగన్‌

వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా  ఆర్థికసాయం అందించనున్నట్టు చెప్పారు. ‘‘ఆర్థిక స్వావలంబన లేక మహిళలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పాదయాత్ర సమయంలో చూశా. 45-60 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందించాలని అప్పుడే నిర్ణయించా. గతంలో ఈ ప్రకటన చేసినప్పుడు నాపై విమర్శలు చేశారు’’ అని సీఎం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆమె ఎంపిక ఆశ్చర్యాన్ని కలిగించింది: ట్రంప్‌

 డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలాహారిస్‌ను ఎంపిక చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఒక ‘భయంకరమైన వ్యక్తి’ అంటూ వైట్‌హౌజ్‌లో విలేకరులతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. ప్రైమరీల స్థాయిలో నామినేషన్ కోసం పోటీ పడుతున్నప్పుడే ఆమె పేలవ ప్రదర్శన తనను ఆకట్టుకోలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘ఆమె పేలవ ప్రదర్శన చూసి చాలా ఆశ్చర్యపోయాను. యూఎస్‌ సెనేట్‌లో ఆమె అంత అగౌవరనీయమైన వ్యక్తి ఎవరూ లేరు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. నెటిజన్లు బాధ్యతగా వ్యవహరించాలి: కేటీఆర్‌

సామాజిక మాధ్యమ వినియోగదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. ఒక తప్పుడు పోస్టు, ప్రచారం ఎంతటి అనర్థానికి దారితీస్తుందో ఆయన ట్విటర్‌ వేదికగా ఉదహరించారు. బెంగళూరులో ఓ వర్గాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్టుల విషయంలో మంగళవారం రాత్రి చెలరేగిన అల్లర్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 60 మంది పోలీసులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి 147 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కొవిడ్‌ మరణాల్లో ప్రపంచంలోనే 4వ స్థానానికి..!

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24గంటల్లో మరో 834 మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు. దీంతో బుధవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 46,091కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. దీంతో అత్యధిక మరణాలు సంభవిస్తోన్న దేశాల జాబితాలో ప్రపంచంలోనే నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్‌ మరణాల సంఖ్యకు భారత్ చేరువయ్యింది. ఇక పాజిటివ్‌ కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. నిన్న కొత్తగా  60,963 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. రష్యా టీకాపై ఓ అంచనాకు రావాల్సి ఉంది:ఎయిమ్స్‌

ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు తమ దేశం టీకాను సిద్ధం చేసిందంటూ ప్రకటించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు టీకా సమర్థతపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌(ఎయిమ్స్‌) డైరెక్టర్‌ డాక్టర్ రణదీప్‌ గులేరియా స్పందించారు. ‘‘రష్యా టీకా విజయవంతమైతే..అది ఎంతవరకు సురక్షితం, ఏమేరకు ప్రభావంతమైనది అనే అంశాలపై అంచనాకు రావాల్సి ఉంటుంది’’ అని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ నొప్పి ఎలా ఉంటుందో నాకు తెలుసు:యువీ

గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌కు ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. శ్వాసకోస సంబంధ సమస్యలతో ఇటీవల ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన సోమవారం ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సంజయ్‌ దత్‌ ఆరోగ్యంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ ట్విటర్‌ ద్వారా స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్రీ.శ. 536... ఆ ఏడాది నరకం చూపించింది..

2020.. ఎంతో ఆనందోత్సాహాలతో ప్రారంభమైంది.. కోట్లాదిమంది తమ భవిష్య ప్రణాళికలు రచించుకున్నారు... ఎన్నో ఆశలు.. అన్నీ కరోనా మహమ్మారి దెబ్బకు తలకిందులయ్యాయి. బతికుంటే చాలు అన్న విధంగా జీవితం మారింది. ఈ ఏడాది ఇలా మారడంపై అనేక మంది అవేదన  చెందుతున్నారు. అయితే కొన్ని శతాబ్దాలకు ముందు ఓ ఏడాదిలో ప్రజలు పడిన కష్టాల్ని తలచుకుంటే ఇప్పుడు మన ముందు ఉన్నది చాలా చిన్న కష్టమే అని తెలుస్తుంది.  అష్టకష్టాల ఏడాది క్రీ.శ. 536 ... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. అప్పుడైనా నా మీద కామెంట్స్‌ ఆగుతాయేమో!

‘ధడక్‌’లో జాన్వీ కపూర్‌ను చూసి... ‘ఎంత ముద్దుగా ఉందో ఈ అమ్మాయి’ అనుకున్నారు. అంతలోనే ‘నా రెండో సినిమా... ‘గుంజన్‌ సక్సేనా’’ అంటూ గర్వంగా ప్రకటించింది. బార్బీ డాల్‌లా ఉండే జాన్వీ... ‘కార్గిల్‌ గాళ్‌’ బాధ్యతను మోయగలదా అనిపించింది. అభిమానులను మెప్పించగలదా అనుకున్నారు. దానికి ఫస్ట్‌లుక్, ట్రైలర్‌తో ‘యస్‌స్‌స్‌...’ అంటూ సమాధానం చెప్పింది. ఈ రోజు నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ‘గుంజన్‌ సక్సేనా’ గా వచ్చి అందరి మన్ననలు అందుకుంటోంది. ఇటీవల కాలంలో ఈ సినిమా గురించి, తన గురించి జాన్వీ చాలా కబుర్లు చెప్పింది. అవేంటో చూసేయండి... పనిలో పనిగా జాన్వీ బ్యూటిఫుల్‌ ఫొటోల మీద కూడా ఓ లుక్కేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.