close

తాజా వార్తలు

Published : 27/08/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు సమస్యేంటి?:ఉత్తమ్‌

కొవిడ్‌ కేసులు, మరణాలను దాస్తున్నారని వ్యాఖ్య

హైదరాబాద్‌: రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అన్ని విధాలా వైఫల్యం చెందిందని.. ప్రజల్లో ఆ పార్టీపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. గాంధీభవన్‌లో సేవాదల్‌ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించిన అనంతరం డీసీసీ అధ్యక్షులతో ఉత్తమ్‌ సమావేశయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో ప్రజలు, వలస కార్మికులకు సేవ చేయడంలో డీసీసీలు ముందుండి నడిపించాయని కొనియాడారు. డీసీసీ పదవుల్లో కొందరికి అన్యాయం జరిగినా పార్టీ కోసం సేవ చేయడం అభినందనీయమన్నారు. స్థానిక ముఖ్య నేతలను కలుపుకొని కమిటీలు వేయాలని డీసీసీ అధ్యక్షులకు ఉత్తమ్‌ సూచించారు. వచ్చేనెల 3లోపు అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేసి సంస్థాగతంగా బలోపేతం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమని ఉత్తమ్‌ ధీమా వ్యక్తం చేశారు. 

అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉత్తమ్‌ విమర్శలు గుప్పించారు. కొవిడ్‌ నివారణలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కరోనాతో చనిపోయిన వారిని ఇతర రోగాలతో మృతిచెందినట్లుగా అబద్ధాలు చెబుతోందని.. కొవిడ్‌ కేసులు, మరణాలను కూడా దాస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సరైన సంఖ్యలో కొవిడ్‌ పరీక్షలు చేయడం లేదని విమర్శించారు. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చేందుకు ప్రభుత్వానికి ఉన్న సమస్యేంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలు భయపడుతున్నారని.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళదామంటే అక్కడి బిల్లులు భరించలేని పరిస్థితి నెలకొందన్నారు. కరోనా కట్టడి విషయంలో పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని చూసి సీఎం కేసీఆర్‌ నేర్చుకోవాలని ఉత్తమ్‌ హితవు పలికారు. ప్రజలకు అండగా ఉండేందుకే సీఎల్పీ ఆధ్వర్యంలో ఆస్పత్రుల సందర్శన నిర్వహిస్తున్నామన్నారు. శ్రీశైలం దుర్ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని