close

తాజా వార్తలు

Published : 04/12/2020 17:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉప్పల్‌ ఎమ్మెల్యే సతీమణి ఓటమి

హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు తెరాస 35, భాజపా 24, ఎంఐఎం 30 స్థానాల్లో విజయం సాధించాయి. తెరాస తరఫున బరిలోకి దిగిన ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి సతీమణి స్వప్న ఓటమి పాలయ్యారు. హబ్సిగూడ డివిజన్‌ నుంచి బరిలోకి దిగిన ఆమె.. భాజపా అభ్యర్థి చేతన చేతిలో పరాజయం చవిచూశారు. మరోవైపు చర్లపల్లి నుంచి బరిలోకి దిగిన  మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి యాదవ్‌ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి భాజపాకు చెందిన సురేందర్‌గౌడ్‌పై ఆమె జయకేతనం ఎగురవేశారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన