close

తాజా వార్తలు

Published : 28/11/2020 00:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రామంతాపూర్‌లో తెరాస, భాజపా ఘర్షణ

రామంతాపూర్‌: గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణల నెపంతో భాజపా, తెరాస కార్యకర్తల మధ్య రామంతాపూర్‌ డివిజన్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..రామంతాపూర్‌ డివిజన్‌ తెరాస ఇన్‌ఛార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారంటూ భాజపా కార్యకర్తలు ఆరోపించారు.  శారదానగర్‌లోని ఓ ఇంటిలో ఉన్న ఆయన అనుచరుల వద్దకు భాజపా కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత  చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఉప్పల్‌ పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని ఇరువర్గాలకు చెందినవారిని ఠాణాకు తీసుకెళ్లారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన