నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు
close

తాజా వార్తలు

Published : 28/04/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిరాడంబరంగా తెరాస ఆవిర్భావ వేడుకలు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన తెరాస ఈ రోజు 20వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకొని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలవేశారు. అలాగే, జయశంకర్‌ సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. నిరాడంబరంగా జరిగిన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో మంత్రులు కేటీఆర్‌, ఈటలతో పాటు కేకే తదితర ముఖ్య నేతలంతా మాస్కులు ధరించి పాల్గొన్నారు. 

2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన తెరాస ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో వ్యూహ ప్రతివ్యూహాలతో అనేక విజయాపజయాలు, ఒడుదొడుకులు ఎదుర్కొని దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించినా కరోనాతో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నిరాడంబరంగా జరపాలని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలంతా ఎవరి ఇంటిపై వారు పార్టీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ సూచించారు. వారం రోజుల పాటు రక్తదానం చేయాలని దిశానిర్దేశం చేశారు. Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని