close

తాజా వార్తలు

Published : 20/11/2020 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సీఎంపై వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై ఫిర్యాదు

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) పార్థసారథిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కోరారు. హైదరాబాద్ మాసబ్‌ ట్యాంకులోని కార్యాలయంలో ఎస్‌ఈసీ పార్థసారథిని పల్లా కలిశారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ను దేశ ద్రోహి అని బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై వారు ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ప్రజలు, నాయకులను అవమానపరిచేలా మాట్లాడుతున్న సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరినట్లు తెలిపారు.

‘‘ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సీఎంపై చిల్లరగా, వెకిలిగా మాట్లాడటం బండి సంజయ్‌కే చెల్లుతుంది. ఎన్నికల ప్రచారంలో ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయం ఏమాత్రం సరికాదు. తక్షణమే బండి సంజయ్‌ను అరెస్టు చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలి. ఈ తరహాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సామరస్యంగా ఉన్న భాగ్యనగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు’’ అని ఎస్ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో నేతలు వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన