ఆధార్‌ అడగొచ్చు..: తెలంగాణ ప్రభుత్వం
close

తాజా వార్తలు

Updated : 21/12/2020 16:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆధార్‌ అడగొచ్చు..: తెలంగాణ ప్రభుత్వం

ధరణిలో ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై హైకోర్టులో విచారణ జరిగింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై నవంబర్‌ 3న ఉన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. సాగుభూముల యజమానుల ఆధార్‌, కులం వివరాలకు ఒత్తిడి చేయొద్దని స్టే విధించిన సందర్భంగా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో స్టేను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు వెకేట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. 

సాగుభూములపై సబ్సిడీ పథకాలు అమల్లో ఉన్నందున ఆధార్‌ వివరాలు అడగొచ్చని ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఆధార్‌ను గుర్తింపుకార్డుగా పరిగణించవచ్చంటూ చట్టం పేర్కొంటున్న విషయాన్ని తెలిపింది. దీనిపై స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం దాఖలు చేసిన వెకేట్‌ పిటిషన్‌పై అభ్యంతరాలను ఈనెల 31లోపు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది. అనంతరం ధరణి పిటిషన్లపై విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది.  

ఇవీ చదవండి..

ధరణిలో భూ వివరాలు చూసుకోవచ్చు

జనవరి 3 దాకా సర్వదర్శనం టోకెన్లు లేనట్లే


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని