ఉస్మానియా ఆస్పత్రిపై చాలా అంశాలు పరిశీలించాలి
close

తాజా వార్తలు

Updated : 08/09/2020 20:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉస్మానియా ఆస్పత్రిపై చాలా అంశాలు పరిశీలించాలి

విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్య

హైదరాబాద్‌: ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం వివాదంపై అనేక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఉస్మానియా ఆస్పత్రిని కూల్చవద్దని కొందరు.. కూల్చివేసి కొత్తగా నిర్మించాలని మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ బి.వినయ్‌ సేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ఉస్మానియా ఆస్పత్రి గూగుల్‌ మ్యాప్‌, సైట్‌ ప్లాన్‌ను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. పిటిషనర్లకు కూడా మ్యాపులు ఇవ్వాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మ్యాపులను విశ్లేషించి వాదనలకు సిద్ధం కావాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు హైకోర్టు సూచించింది. 

మూడు బ్లాకుల్లో హెరిటేజ్‌ భవనం ఉందని, అదికాకుండా మరో 15 ఎకరాల్లో మిగతా ఆస్పత్రి ఉన్నట్లు మ్యాపుల్లో ఆర్‌అండ్‌బీ శాఖ పేర్కొంది. ఆధునిక, సమీకృత ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రస్తుత భవనం కూల్చాల్సిందేనా? వివాదాస్పద హెరిటేజ్‌ భవనం పక్కన పెట్టి మిగతా ప్రాంతంలో నిర్మించవచ్చా? వంటి అనేక అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. సుదీర్ఘ విచారణ జరగాల్సి ఉన్నందున వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కాకుండా హైకోర్టు తెరిచాక నేరుగా విచారణ జరపాలని సీనియర్‌ న్యాయవాది సత్యం రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. అయితే వైద్యులు, రోగులు ఇబ్బంది పడుతున్నారని.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే విచారణ త్వరగా పూర్తి చేయాలని న్యాయవాది సందీప్‌ రెడ్డి కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ వివాదం తేల్చిన వెంటనే ఆస్పత్రి భవనం కట్టేస్తారా? అని  ప్రశ్నించింది. పోలీసు జంట భవనాల నిర్మాణం ఆరేళ్లుగా సాగుతోందని వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని