వేతనాల్లో కోతపై త్వరలో నిర్ణయం
close

తాజా వార్తలు

Published : 08/09/2020 13:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేతనాల్లో కోతపై త్వరలో నిర్ణయం

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది.

తగ్గించిన వేతనాలు, పింఛన్ల చెల్లింపులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోనుందని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఈనెల 28లోపు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందన్నారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే వెంటనే అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పింఛనర్లకు బకాయి ఉన్న మొత్తం ఒకేసారి చెల్లించాలని సూచించింది. ఎక్కువ వాయిదాల్లో చెల్లిస్తే వారు ఇబ్బంది పడతారని కోర్టు అభిప్రాయపడింది. బకాయి ఉన్న మొత్తానికి 12 శాతం వడ్డీతో చెల్లించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ కోరారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ .. ముందు తగ్గించిన జీతం, ఫించను చెల్లించనీయండన్న హైకోర్టు విచారణను అక్టోబరు ఒకటో తేదీకి వాయిదా వేసింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని