close

తాజా వార్తలు

Updated : 01/08/2020 12:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

తెలంగాణలో కొత్తగా 2,083 కేసులు

హైదరాబాద్‌ :తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 2,083 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో రాష్ట్రంలో  మొత్తం కేసుల సంఖ్య 64,786కి చేరింది. మరో 11 మంది మృతి చెందడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 530కి పెరిగింది. తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 578 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డిలో 228, వరంగల్‌ అర్బన్‌లో 134, కరీంనగర్‌లో 108, సంగారెడ్డిలో 101 కేసులు బయటపడ్డాయి.

కొవిడ్‌ నుంచి కొలుకుని తాజాగా 1114 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 46,502 మంది కోలుకోగా.. 17,754 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11,359 మంది హోమ్‌/ఇనిస్టిట్యూషనల్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని