close

తాజా వార్తలు

Published : 28/02/2021 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉగాది నుంచి ఆర్జిత సేవలకు అనుమతి: తితిదే

రూ. 2,937 కోట్ల వార్షిక బడ్జెట్‌కు ఆమోదం

వివరాలు వెల్లడించిన తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

తిరుమల: ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. 2021-22 సంవత్సరానికి గానూ రూ. 2,937 కోట్లతో కూడిన తితిదే వార్షిక బడ్జెట్‌ను ధర్మకర్తల మండలి ఆమోదించింది. బడ్జెట్‌ ఆమోదంతో పాటు పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. 80 అంశాలతో రూపొందించిన అజెండాతో పాటు కొన్ని కీలకమైన అంశాలను టేబుల్‌ అజెండాగా సమావేశం ముందుపెట్టారు. ఈ మేరకు సమావేశ వివరాలను ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు.

రథసప్తమి వాహన సేవలను వైభవంగా నిర్వహించినట్లు సుబ్బారెడ్డి చెప్పారు. ఇకపై తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో తులాభారం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అలాగే దేశంలోని అన్ని కల్యాణ మండపాలను అభివృద్ధి చేయాలని తీర్మానించామన్నారు. తితిదే వేద పాఠశాలను ఎస్వీ వేద విజ్ఞానపీఠంగా పేరు మార్చాలని మండలి నిర్ణయించినట్లు పేర్కొన్నారు. బర్డ్‌ ఆస్పత్రి పాతభవనంలో చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటుకు రూ.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే తిరుమలలో విద్యుత్‌ వాడకంపై క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో భాగంగా అతిథి గృహాల్లో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అయోధ్యలో శ్రీవారి ఆలయానికి భూమి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. శ్రీవారి మెట్ల మార్గంలోనూ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.



ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని