close

తాజా వార్తలు

Updated : 23/05/2020 17:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్థిరాస్తుల విక్రయానికి తితిదే ఉత్తర్వులు

తిరుమల: తమిళనాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పరిధిలోని స్థిరాస్తులను విక్రయించేందుకు తితిదే నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 23 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి తితిదే ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 29న జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఆస్తుల విక్రయానికి సంబంధించి తీర్మానం చేశారు. ఏప్రిల్‌ 30న బోర్డు ఉత్తర్వులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని 23 ప్రాంతాల్లో ఆస్తుల విక్రయానికి రెండు బృందాలను తితిదే ఏర్పాటు చేసింది. ఈ రెండు బృందాల్లో 8 మంది అధికారులను నియమిస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తుల బహిరంగ వేలానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులకు బోర్డు సూచించింది.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని