close

తాజా వార్తలు

Published : 23/11/2020 17:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలి: ఎల్‌.రమణ

హైదరాబాద్: రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆరోపించారు. ఇష్టానుసారంగా పనులు చేపట్టడంతో రూ.68వేల కోట్లు ఉన్న అప్పు.. రూ.3.10లక్షలకు చేరిందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా మేనిఫెస్టోను రమణ విడుదల చేశారు. తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ రద్దు కావాలంటే.. టీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను విశేషంగా అభివృద్ధి చేసిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. హామీలను విస్మరించిన తెరాసను ప్రజలు ఆశీర్వదించే పరిస్థితిలేదని చెప్పారు. సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తెదేపా హయాంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. హ్యాపీ హైదరాబాద్‌ నినాదంతో గ్రేటర్‌ ఎన్నికలు వెళ్తున్నట్లు ఆయన వివరించారు. తెదేపాకు నమ్మి ఓటేయాలని.. నమ్మకంగా పనిచేస్తామని రావుల అన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

సినిమా
మరిన్ని

దేవతార్చన